పంజాబ్ అధ్యక్షుడిగా రాజా వారింగ్ ఎంపికయ్యారు. పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ పీసీసీ పదవికి సిద్ధూ రాజీనామా చేశారు. దాంతో సిద్ధూ స్థానంలో రాజా వారింగ్ నియామకం జరిగింది.
తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు మరోసారి అవార్డుల పంట పండింది. జిల్లా, మండల, గ్రామ పంచాయతీలకు వివిధ కేటగిరిలలో 19 అవార్డులు వచ్చాయి. నాలుగు కేటగిరీల్లో 19 ఉత్తమ అవార్డులు లభించాయి. ఉత్తమ జిల్లా పరిషత్ గా సిరిసిల్లకు అవార్డు దక్కింది.
Advertisement
ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. 16 రోజుల్లోనే వెయ్యి కోట్ల క్లబ్ లో చేరింది. అంతే కాకుండా ఇప్పటి వరకూ వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు దంగల్, బాహుబలి 2 కాగా ఇప్పుడు ఆ లిస్ట్ లో ఆర్ఆర్ఆర్ కూడా చేరింది.
రేపు ఏపీ మంత్రి వర్గ పునర్వ్యవస్తీకరణ జరగనుంది. కేబినెట్ లోకి కొత్తగా దాదాపు 15 మంది మంత్రులు రానున్నారు. రేపు ఉదయం పదకొండున్నరకు మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది.
Advertisement
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు షాక్ తగిలింది. అవిశ్వాస తీర్మాణంలో ఇమ్రాన్ ఖాన్ ఓడిపోయారు. ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా 174మంది ఓటువేశారు. దాంతో ఇమ్రాన్ అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు షెహబాజ్ షరీఫ్ పాక్ ప్రధాని అయ్యే అవకాశం ఉంది.
శ్రీరామనవమి సంధర్బంగా భద్రాచలం కు భక్తుల తాకిడి పెరిగిపోయింది. రాష్ట్రంలోని నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు రాములోరి కల్యాణం చూసేందుకు విచ్చేశారు.
ఐపీఎవ్ లో ముంబై మళ్లీ ఓటమిపాలయ్యింది. ఐదు మ్యాచ్ లకు గానూ నాలుగు మ్యాచ్ లలో ఓటమిపాలైంది. ఇక ఓటిమి తరవాత కోలుకున్న ఆర్సీబీ వరుసగా మూడో సారి విజయకేతనం ఎగరవేసింది.
ఏపీలో మంత్రి పదవులు ఎవరిని వరించనున్నాయి అనేదానిపై జోరుగా బెట్టింగ్ లు జరుగుతున్నాయి. పల్లెల్లు పట్టణాల్లో ఈ బెట్టింగ్ లు ఐపీఎల్ ను తలపిస్తున్నాయి.
రైల్వేను ప్రైవేటీకరించే ఆలోచనలు లేవని కేంద్రం స్పష్టం చేసింది. జాతీయ రవాణా సాధనమైన రైల్వేను ప్రైవేటీకరించే ఆలోచన లేదని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు.