ఆకాశమే నీ హద్దురా సినిమాతో అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్ అపర్ణ బాల మురళీ. ఈ మలయాళ కుట్టి అందం అభినయం తో ప్రేక్షకుల మనసు దోచుకుంది. అంతే కాకుండా ఆకాశమే నీ హద్దురా సినిమాలో నటనకు గానూ నేషనల్ అవార్డు ను సైతం సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే హీరోయిన్ లు పబ్లిక్ ఈవెంట్ లకు వెళ్ళినపుడు కొన్నిసార్లు చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి.
Advertisement
అలాంటి సంఘటన అపర్ణ కు కూడా ఎదురయ్యింది. అపర్ణ బాల మురళి తన కొత్త సినిమా ప్రమోషన్స్ కోసం ఎర్నాకులం లోని ప్రభుత్వ లా కాలేజీకి వెళ్ళింది. కాగా అక్కడ ఓ విద్యార్థి అపర్ణ కుర్చీ లో కూర్చొని ఉంటే చేయి పట్టుకుని లేపే ప్రయత్నం చేశాడు. దాంతో అపర్ణ చేయి ఇవ్వడానికి ఆలోచించింది.
Advertisement
అంతే కాకుండా అపర్ణ నిలుచున్న తర్వాత ఆమె భుజం పై చేయి వేసేందుకు ప్రయత్నం చేశాడు. దాంతో వెంటనే అసహనం వ్యక్తం చేసింది. పక్కకు జరగటం తో విద్యార్థి స్వారీ చెప్పి పక్కకు జరిగాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇక తాజాగా అపర్ణ ఈ ఘటన పై స్పందించింది.
నన్ను బలవంతంగా చేయి పట్టుకుని లేపడం సరైంది కాదు. అతని చేతులు నా భుజం పై వేసేందుకు ప్రయత్నించాడు. ఒక మహిళ పట్ల ఇంత నీచంగా ప్రవర్తిస్తారా…ఈ సంఘటన పై అధికారులకు ఫిర్యాదు చేసే ఉద్దేశ్యం నాకు లేదు. నాకు అంత సమయం కూడా లేదు …ఘటన జరిగిన వెంటనే నిర్వాహకులు నాకు క్షమాపణలు చెప్పారు. అంటూ అపర్ణ వ్యాఖ్యానించింది.