ఏపీ ముఖ్యమంత్రి జగన్ కుటుంబ ఆస్తి 500 కోట్లు అని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. మహానాడులో చంద్రబాబు ఉపన్యాసం అంతా పరనిందా, ఆత్మస్తుతి అని.. సైకిల్ కరెంట్ పెడితే దూసుకుని పోతుందని అంటున్నాడని వెల్లడించారు. సైకిల్, మోటార్ బండి ఒకటి అవుతుందా?? ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు దొంగిలించిన సైకిల్ అది అంటూ ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు హస్తం నీడలో ఉన్నాడు… లక్ష్మి పార్వతిని అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్ను నిండా ముంచాడని ఆగ్రహించారు.
Advertisement
Advertisement
ప్రకటించిన చంద్రబాబు కుటుంబ ఆస్తి వెయ్యి కోట్లు అని.. ఎన్నికల అఫిడవిట్, ఇన్కం ట్యాక్స్ లో డిక్లేర్ చేసిన విషయమే కదా అని వెల్లడించారు. దేశంలోనే అత్యంత ధనిక రాజకీయ నాయకుడు చంద్రబాబు అని.. మీ నాన్న ఖర్జూర నాయుడు నీకిచ్చిన ఆస్తి ఎంత?? అని నిలదీశారు. రెండు ఎకరాల నుంచి వేయి కోట్ల ఆస్తి ఎలా సంపాదించావ్?? అని ఫైర్ అయ్యారు.
ఏం వ్యాపారం చేశావ్?? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ కుటుంబ ఆస్తి 500 కోట్లు అని.. తన ఆస్తిలో సగం ఉన్న ముఖ్యమంత్రిని దేశంలోనే ధనిక ముఖ్యమంత్రి అని చంద్రబాబు చెబుతున్నాడని నిప్పులు చెరిగారు. ఏం చెప్పినా జనాలు నమ్మేస్తారు అనే దొంగ తెలివి తేటలు చంద్రబాబువేవని.. ఎన్టీఆర్ దగ్గర ఆషాఢభూతి వేషం వేసింది చంద్రబాబు కాదా?? అని చురకలు అంటించారు. ఓట్ల కోసం నక్క వేషాలు వేసేది చంద్రబాబు అని నిప్పులు చెరిగారు.