Home » దసరా నుంచే విశాఖ నుంచి పరిపాలన – సీఎం జగన్

దసరా నుంచే విశాఖ నుంచి పరిపాలన – సీఎం జగన్

by Bunty
Ad

 

ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరిగింది. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం…. దాదాపు మూడు గంటల పాటు సాగింది. ఈ ఏపీ కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం జగన్ ప్రతిపాదనలకు మంత్రులు కూడా ఓకే చెప్పేశారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులతో సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

దసరా పండుగ విశాఖలోనేనని.. పేర్కొన్నారు సిఎం జగన్. దసరా పండుగ నుంచే విశాఖ నుంచి పాలన ప్రారంభం అవుతుందని చెప్పుకొచ్చారు సిఎం జగన్ మోహన్ రెడ్డి. ఒన్ నేషన్, ఒన్ ఎలక్షన్ పై కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియదని.. కాబట్టి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండండని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. అవసరమైతే అసెంబ్లీ వేదికగా చంద్రబాబు అవినీతి స్కాం ల పై చర్చిద్దామన్నారు సిఎం జగన్ మోహన్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాలను అందరూ సీరియస్ గా తీసుకోవాలని కోరారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.

Advertisement

అలాగే, మంత్రివర్గ సమావేశంలో  ఉద్యోగులకు సంబంధించి సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగి రిటైర్‌ అయిన సమయానికి ఇంటి స్థలం లేని వారికి కచ్చితంగా ఇంటిస్థలం ఉండాలని కోరారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని పేర్కొన్నారు. రిటైర్‌ అయిన తర్వాత కూడా ఉద్యోగులు, వారి పిల్లలు ఊడా ఆరోగ్య శ్రీ కింద అందరూ కవర్‌ అయ్యేలా చూడాలని ఆదేశించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. రిటైర్‌ అయిన పిల్లల చదువులు కూడా ఫీజు రియింబర్స్‌ మెంట్‌ కింద కూడా ప్రయోజనాలు అందేలా చూడాలి.. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వెల్లడించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading