Home » Prabhas : పెళ్లి చేసుకున్న ప్రభాస్, అనుష్క?… వైరల్ అవుతోన్న పిక్స్..

Prabhas : పెళ్లి చేసుకున్న ప్రభాస్, అనుష్క?… వైరల్ అవుతోన్న పిక్స్..

by Bunty
Ad

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా కొనసాగుతున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఇటీవల కాలంలోనే ఆది పురుష్ సినిమాతో ఇండియా వ్యాప్తంగా ఇండస్ట్రీని షేక్ చేశాడు ప్రభాస్. ఇక ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్.

Advertisement

అయితే 40 సంవత్సరాలు దాటినప్పటికీ ఇంకా రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి చేసుకోలేదు. పెళ్లి మాట ఎత్తగానే… టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు. అయితే ప్రభాస్ మరియు హీరోయిన్ అనుష్క ఇద్దరు ప్రేమలో ఉన్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కానీ వీరిద్దరూ ఎక్కడా కూడా తమ ప్రేమ విషయాన్ని వెల్లడించలేదు. కానీ వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని మాత్రం వార్తలు బాగా వైరల్ అయ్యాయి.

Advertisement

అయితే ఇలాంటి వార్తలు గత పది సంవత్సరాలుగా వచ్చినప్పటికీ… ప్రభాస్ మరియు అనుష్క మాత్రం పెళ్లి చేసుకోవడం లేదు. అసలు పెళ్లి విషయంలో వీరు పెదవి విరవడం లేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కు విపరీతంగా కోపం వచ్చింది. ఇంకేముంది ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ప్రభాస్ మరియు అనుష్కకు పెళ్లి జరిగినట్లు… వారిద్దరికీ ఒక పాప కూడా పుట్టేసినట్లు ఫోటోలు క్రియేట్ చేశారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నిజంగానే ప్రభాస్ మరియు అనుష్క పెళ్లి చేసుకున్నట్లు అందరూ అనుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading