అక్కినేని నాగేశ్వర్ రావు ఒకప్పటి అమ్మాయిల కలల రాకుమారుడు. ఆయన సినిమాలకు యూత్ లో తెగ క్రేజ్ ఉండేది. ముఖ్యంగా రొమాంటిక్ ప్రేమకథా చిత్రాలలో నటించడంతో నాగేశ్వరరావుకు అమ్మాయిల్లోనే ఒక్కవ ఫ్యాన్స్ ఉండేవారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ చెన్నై నుండి హైదరాబాద్ కు రావడం వెనక కూడా నాగేశ్వరరావు కృషి ఎంతో ఉంది.
Advertisement
అదేవిధంగా హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోస్ ను నిర్మించి ఇక్కడే సినిమా షూటింగ్ లు జరుపుకునేలా చేశారు. ఏఎన్ఆర్ తన కుమారుడు నాగార్జునతో కలిసి సైతం సినిమాలు చేశారు. చివరగా కుటుంబం అంతా కలిసి మనం అనే చిత్రంలో నటించగా ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమానే ఏఎన్ఆర్ కు చివరి సినిమా అయ్యింది. ఏఎన్ఆర్ చివరిరోజుల్లో క్యాన్సర్ భారినపడ్డారు.
Advertisement
కాగా ఆయన చివరిరోజుల్లో పడిన ఇబ్బందులను నటుడు కాందబరి కిరణ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కాదంబరి కిరణ్ కు అక్కినేని ఫ్యామిలీతో ఎంతో అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ కుటుంబం గురించి కాదంబరి కిరణ్ కు చాలా విషయాలు తెలుసు. ఇక కిరణ్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…ఏఎన్ఆర్ తో తనకు ఉన్న అనుబంధం గురించి తెలిపారు.
ఏఎన్ఆర్ చివరిరోజుల్లో తాను ఆయన పక్కనే ఉన్నానని చెప్పారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉండటంతో కలవడానికి ఎవరినీ రానించేవారు కాదని చెప్పారు. ఏఎన్ఆర్ గారి కాళ్లు పట్టుకుంటే చర్మం ఊడి వచ్చేదని ఆయన అనారోగ్య వల్ల అంతటి దారుణమైన పరిస్థితిని ఎదురుకున్నారని తెలిపారు. చికిత్స తీసుకున్నా ఆయన క్యాన్సర్ నుండి బయటపడలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇప్పటికీ ఏఎన్ఆర్ ను గుర్తుచేసుకుని నాగార్జున బాధపడుతూ ఉంటారన్న సంగతి తెలిసిందే.