అక్కినేని నాగేశ్వర రావు గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. దాదా ఫాల్కేర్ అవార్డు అందుకున్నారు. ఆయన చనిపోయాక తెలుగు సినిమా ఇండస్ట్రీని విషాదం లోకి ముంచేశారు. 90 ఏళ్లు జీవించిన అక్కినేని సెంచరీ కొడతారని అంతా అనుకున్నారు కానీ సడన్ గా గుండెపోటు రావడం తో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. అయితే అక్కినేని చనిపోయిన తర్వాత ఆయనకి సంబంధించిన కొన్ని ఆస్తులని సుమంత్ కి కూడా ఇచ్చారట. ఇక వివరాల్లోకి వెళితే… జూబ్లీహిల్స్ లో ఉన్న ఏఎన్ఆర్ ఆస్తుల ని సుమంత్ కి చెందేలా ఆయన బతికి ఉన్నప్పుడే చెప్పేసారట.
Advertisement
ఏఎన్ఆర్ పెద్ద కూతురు సత్యవతి యార్లగడ్డ సురేంద్ర కొడుకు సుమంత్. సుమంత్ పుట్టాక తల్లిదండ్రులు అమెరికా వెళ్ళిపోయారు. ఏఎన్ఆర్ చెప్పడం తో సుమంత్ ని పెద్ద కూతురు ఇక్కడే వదిలేసి వెళ్లారు అక్కినేని దంపతులు సుమంత్ ని దత్తపుత్రునిగా చూసుకునే వారు. సుమంత్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లోనే చదువుకున్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేశారు. సుమంత్ ఇండస్ట్రీ లోకి ప్రేమ కథ సినిమా తో వచ్చారు. తర్వాత కొన్ని సినిమాల్లో నటించారు.
Advertisement
సినిమాల్లో పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ కొంచెం గుర్తింపు అయితే వచ్చింది. సత్యం వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా ఆయన కెరియర్ లో ఉన్నాయి. సుమంత్ కీర్తి రెడ్డి ని పెళ్లి చేసుకున్నారు కానీ రెండేళ్లకే మనస్పర్ధలతో విడాకులు తీసుకున్నారు. మరో పక్క తల్లి సత్యవతి చనిపోవడం డిప్రెషన్ లో ఉన్న సుమంత్ మళ్ళీ తాతయ్య దగ్గరికి రావడం వంటివి జరిగాయి. మనవడు సుమంత్ ని చూసి బంజారాహిల్స్ లోని ఏఎన్ఆర్ సెంటర్ ని సుమంత్ కి రాసి ఇచ్చేశారు ఇప్పుడు దాని విలువ ఏకంగా 100 కోట్లు ఉంది.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!