Home » జెండాపై హనుమంతుడిని ఎందుకు పెడతారు? దీని వెనుక ఉన్న మహాభారత కథ ఏమిటో తెలుసా…!

జెండాపై హనుమంతుడిని ఎందుకు పెడతారు? దీని వెనుక ఉన్న మహాభారత కథ ఏమిటో తెలుసా…!

by Bunty
Ad

ఆంజనేయ స్వామి లేకపోతే రామాయణానికి అర్థం లేదు. రామాయణంలో హనుమంతుని పాత్ర గురించి ప్రతి ఒక్కరి తెలుసు. కానీ మహాభారతంలో కూడా హనుమంతుడి పాత్ర ఉందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. మహాభారతంలో హనుమంతుడి పాత్ర జెండాపై కపిరాజు అనే మాట ఆ కాలం నుంచే వచ్చింది. మహాభారతంలో ఆంజనేయ స్వామి రెండు సందర్భాల్లో మనకు కనిపిస్తాడు. ఒకసారి భీముడు గర్వభంగం జరిగిన సందర్భంలో. మరోసారి పాండవులు అరణ్యవాసం చేస్తున్న సందర్భంలో ద్రౌపతి సౌగంధిక పుష్పాలు కావాలని భీముడిని అడుగుతుంది. దీంతో వాటిని తీసుకురావడానికి వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో అక్కడ ఉన్న కోతిని చూసి అడ్డు తప్పుకోమని అంటాడు. దానికి ఆ కోతి నేను ముసలివాడిని. నాకు కదిలే శక్తి కూడా లేదు. నువ్వే అడ్డు తొలగించుకొని వెళ్ళు అని అంటుంది. దాంతో అహంకారంతో ఉన్న భీముడు దాని తోకను పట్టుకొని పక్కకు జరపడానికి ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం ఉండదు.

Advertisement

 

ఆ తర్వాత ఈ కోతి సాధారణమైందని కాదని నన్ను క్షమించు అని భీముడు అడగడంతో ఆ కోతి నిజస్వరూపం దాల్చి భీముడిని హనుమంతుడు ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత మరొక సందర్భంలో కోతి రూపంలోనే అర్జునుడిని కలుస్తాడు. హనుమంతుడు త్రేతాయుగంలో లంకను చేరుకునేందుకు నిర్మించిన వారధిని చూసి దీని నిర్మాణానికి కోతుల సహాయం ఎందుకు. నేను ఒక్కడినే బాణాలతో నిర్మించేవాడినని బాణాలను విసురుతాడు అర్జునుడు. అయితే ఆంజనేయుడు కాలు మోపగానే ఆ వారధి కుప్పకూలిపోతుంది. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న కృష్ణుడు తన దివ్యస్పర్శతో వంతెనను నిర్మిస్తాడు. ఓడిపోయానని భావనతో తన జీవితాన్ని అంతం చేసుకోవాలన్న అర్జునుడికి కురుక్షేత్రంలో సహాయం చేస్తానని ఆంజనేయ స్వామి మాట ఇస్తాడు.

Advertisement

కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం నుంచి చివరి వరకు అర్జునుడి రథ జెండాపై ఉంటాడు ఆంజనేయ స్వామి. కురుక్షేత్ర యుద్ధం చివరి రోజు వరకు జెండాపై ఉన్న హనుమంతునికి కృష్ణుడు కృతజ్ఞతలు తెలియజేస్తాడు. అప్పుడు హనుమంతుడు నమస్కరించి వదిలి వెళ్ళిపోతాడు. హనుమంతుడు వెళ్లిన వెంటనే ఆ రథం అగ్నికి ఆహుతి అవుతుంది. ఇదంతా చూసి అర్జునుడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు కృష్ణుడు ఇప్పటివరకు నీ రథం పైన ఆంజనేయస్వామి ఉండడం వల్ల దివ్యమైన ఆయుధాలు ఏవి నీ రతాన్ని తాకలేకపోయాయి. లేదంటే ఈ రథం ఎప్పుడో అగ్నికి ఆహుతి అయ్యుండేది అని చెబుతాడు. అందుకే జెండాపై కపిరాజు ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని అప్పటి నుంచి జెండాపై కపిరాజు అనటం మొదలైంది.

ఇవి కూడా చదవండి

నాగార్జున మేనకోడలు ‘సుప్రియ’ కష్టాలు చూస్తే కన్నీళ్లు ఆగవు… ఆమె లైఫ్ లో ఇన్ని విషాదాలా…!

టాలీవుడ్ హీరోలకు భార్యలుగా ఇంతమంది రెడ్డి అమ్మాయిలా…!

అంత అందం ఉన్నా.. బాలయ్య కూతుర్లు హీరోయిన్స్ కాలేకపోయారు ?

Visitors Are Also Reading