యాంకర్ అనసూయ గురించి పరిచయం చేయక్కర్లేదు జబర్దస్త్ ద్వారా అనసూయ బాగా పాపులర్ అయ్యారు. యాంకర్ గానే కాకుండా నటిస్తూ ఒక నటిగా కూడా ఎంతో మందిని మెప్పిస్తూ ఉంటుంది అనసూయ. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా తన అందంతో అందరిని మెప్పిస్తూ ఉంటుంది అనసూయ. అనసూయ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి చాలా మందికి తెలియదు ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. అనసూయ నల్గొండ జిల్లా పోచంపల్లి అంటే తెలంగాణకి చెందిన ఆమె. అనసూయ తండ్రి పేరు సుదర్శన్ రావు.
Advertisement
ఒక బిజినెస్ మాన్ ఈయన. తల్లి పేరుని అనసూయ కి పేరుగా పెట్టారు. ఇంట్లో ఎప్పుడు మిలటరీ డిసిప్లిన్ ఉండేది ఎందుకంటే అనసూయని ఆర్మీలోకి పంపించాలని ఆయన అనుకున్నారు. అనసూయ భద్రకా కాలేజ్ నుండి ఎంబీఏ పూర్తిచేశారు. తర్వాత ఐడిబిఐ బ్యాంకులో పని చేశారు కొన్నాళ్ళకి ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ జాబ్ చేశారు. ఇందులో పని చేస్తున్న సమయంలోనే సాక్షి టీవీలో యాంకర్లు కావాలని ప్రకటన రావడంతో ఆమె అప్లై చేశారు. ఆమెని ఎంపిక చేశారు కొన్నాళ్లపాటు అక్కడ జాబ్ చేశారు. తర్వాత అది ఇష్టం లేకపోవడంతో ఇంటికి పరిమితం అయిపోయింది.
Advertisement
కానీ ఆమెకి మాత్రం సినిమాల్లోకి రావాలని కోరిక ఉండేది అవకాశాలు వెతుకుతున్న సమయంలో నాగ వంటి సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా ఆమె అవకాశాన్ని పొందారు. మొదట్లో ఆమె అనుకున్నంత మేర సక్సెస్ సాధించకపోవడంతో సినిమాలను పక్కనపెట్టి టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టారు. యాంకర్ గా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశారు. మాటీవీలో భలే ఛాన్స్ లే ప్రోగ్రాం ద్వారా యాంకర్ గా రీఎంట్రీ ఇచ్చారు తర్వాత జబర్దస్త్ షోలో యాంకర్ గా చేశారు తర్వాత ఆమెకి సోగ్గాడే చిన్నినాయన మొదలు అనేక సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.