బాలకృష్ణ హీరోగా వచ్చిన భగవంత్ కేసరి సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే ఆడపిల్లల తల్లిదండ్రులని ఆలోచింపజేసేలా, ఈ సినిమా ఉంది. అనిల్ రావిపూడి ఈ సినిమాలో చిన్న పిల్లల్ని చైతన్యవంతులు చేయడానికి ఒక సన్నివేశాన్ని పెట్టారు. శరీరంలో ఏ భాగాలను టచ్ చేయకూడదనేది చెప్పి అలాంటి చోట్ల ఎవరైనా టచ్ చేస్తే వెంటనే అమ్మకి చెప్పాలని సూచిస్తూ స్కూల్లో జరిగే ఒక కార్యక్రమం మధ్యలో వెళ్లి బాలకృష్ణ వివరించడం జరుగుతుంది. ఈ సన్నివేశం ఇప్పుడు అందరిని కూడా బాగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం చర్చ దీని మీద జరుగుతోంది.
Advertisement
Advertisement
దీనిపై చాలా ఏళ్ల నుండి చిన్న పిల్లల్ని చైతన్యవంతం చేస్తున్నా భగవాన్ కేసరి సినిమా ద్వారా ఎక్కువ చైతన్యం వచ్చిందని చాలామంది అంటున్నారు. ఎక్స్ ద్వారా రాహుల్ రవీంద్రన్, అనసూయ భరద్వాజ్ స్పందించారు. ఇతర మాధ్యమాలు 10 సంవత్సరాలు సమయం తీసుకుంటే భగవంత్ కేసరి ద్వారా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సీన్ వారం రోజుల్లో సాధించిందని ఇలాంటి విషయాన్ని మాస్ మసాలా సినిమా ద్వారా ప్రజల ముందుకు తీసుకువచ్చినందుకు అనిల్ రావిపూడి గారికి, నందమూరి బాలకృష్ణ గారికి ధన్యవాదాలు అంటూ రాహుల్ రవీంద్రన్ పోస్ట్ చేశారు. అనసూయ భరద్వాజైన పోస్ట్ కి స్పందించి ఇంతకన్నా గొప్పగా ఈ విషయం గురించి చెప్పలేం అని ఆమె కూడా ఒక పోస్ట్ పెట్టారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!