భారతదేశం అంటేనే సర్వమత సమ్మేళనం. ఇక్కడ అత్యధిక జనాభా హిందూ ధర్మాన్ని నమ్ముతారు.. భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సనాతన ధర్మం వ్యాపించి ఉంది. దీనికి ప్రధాన కారణం ప్రపంచ దేశాలలో చాలామంది హిందువులు ఉండటం. వాళ్ళు ఎంత ఎదిగిన ఈ ధర్మాన్ని మాత్రం మర్చిపోవడం లేదు.. అలాంటిది అమెరికాలో కూడా హిందువుల జనాభా లక్షల్లో పెరుగుతోంది. దీంతో అక్కడ దేవాలయాల సంఖ్య కూడా పెరుగుతుంది. ధనిక దేశాల్లో ఒకటైన అమెరికాలో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. ఈ జాబితాలోనే చేరింది హనుమాన్ దేవాలయం. కొన్ని రోజుల క్రితం స్థాపించిన అతిపెద్ద హనుమాన్ విగ్రహం గురించి ఇప్పుడు చూద్దాం..
Advertisement
also read:ఊహతో విడాకులపై స్పందించిన శ్రీకాంత్.. ఏమన్నారంటే ?
Advertisement
అమెరికా మొత్తం జనాభా 29 కోట్లు. 2019 నుంచి అమెరికాలో నివసించే హిందువుల జనాభా 32 లక్షల చేరింది. వీరిలో ఎక్కువ మంది భారతీయులే ఉండడం గమనార్హం. వీరు అమెరికా జనాభాతో కలిసి ఉంటారు. వీరు మన దేశం దాటినా కానీ హిందూ ధర్మాన్ని మాత్రం మర్చిపోలేదు. దీంతో అమెరికన్లు కూడా మన ధర్మాన్ని నమ్ముతూ ఉన్నారు. 2020లో అమెరికాలోని డెలాయిడ్ రాష్ట్రంలో 25 అడుగుల హనుమంతుని విగ్రహం ప్రతిష్టించారు. దీని బరువు కూడా 30 వేల కిలోలు. దీన్ని తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ గ్రానైట్ లో తయారు చేశారట. ఈ విగ్రహం ఖరీదు లక్ష డాలర్లు..
అంటే 80 లక్షల రూపాయలు అన్నమాట. ఈ విగ్రహాన్ని కరీంనగర్ కు చెందిన రాజు తన 12 మంది టీంతో కలిసి చెక్కారు. ఈ 12 మంది ఆరు నెలలు కష్టపడి ఈ విగ్రహాన్ని చెక్కినట్లు రాజు తెలియజేశారు. గత జనవరిలో విగ్రహాన్ని అమెరికాకు తీసుకెళ్లారు. దీంతో అక్కడ హిందూ భక్తులంతా కలిసి అంగరంగ వైవాహంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు. దాదాపు పది రోజుల పాటు ఈ ప్రతిష్టాపన కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్నటువంటి ఎత్తైన విగ్రహాల్లో ఈ విగ్రహం కూడా చోటు సంపాదించుకుంది.
also read: