సినిమాలకు గుడ్ బై చెబుతానని అమీర్ ఖాన్ ప్రకటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ…. చాలా కాలం వరకు తన పిల్లలకు ఏం కావాలో తనకే తెలియదని అన్నారు. అదే పెద్ద సమస్య అయిందని ఆ విషయం తనకు అర్థం కావడానికి చాలా కాలం పట్టిందని చెప్పారు. అప్పుడు తన మీద తనకే కోపం వచ్చిందని అమీర్ ఖాన్ తెలిపారు.
Advertisement
సినిమాలే తనకు తన కుటుంబానికి మధ్య గ్యాప్ కు కారణమయ్యాయని చెప్పారు. దాంతో సినిమాల మీద కూడా కోపం వచ్చిందని…. అందువల్ల సినిమాలకు గుడ్ బై చెప్పాలని అనుకున్నట్టు తెలిపారు. అంతేకాకుండా సినిమాలలో నటించడం కానీ నిర్మించడం కానీ కూడా చేయకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. గతంలోనే తాను సినిమాలకు స్వస్తి చెప్పాలని అనుకున్నట్టు చెప్పారు.
Advertisement
కానీ లాల్ సింగ్ చద్దా సినిమా మార్కెటింగ్ లో భాగంగా తాను చేస్తున్న జిమ్మిక్కు అని ప్రేక్షకులు భావిస్తారని ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు. సాధారణంగా తను సినిమా…సినిమాకు మధ్య 3, 4 ఏళ్లు గ్యాప్ తీసుకుంటానని అన్నారు. లాల్ సింగ్ చద్దా తర్వాత మరో మూడు నాలుగు సంవత్సరాల వరకు ఎలాంటి సినిమాలు చేయను అని ప్రకటించారు. ఇక తాను సినిమాలకు స్వస్తి చెబుతున్నట్లు తన భార్య కిరణ్ రావుకు చెబితే ఆమె ఆశ్చర్యపోయారని అన్నారు.