జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశాడు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. గుంటూరు జిల్లా ఏటి అగ్రహారం లో పర్యటిస్తున్న మాజీ క్రికెటర్ అంబటి రాయుడు…ఆటో డ్రైవర్ యూనియన్ తో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా అంబటి రాయుడు మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థ పై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
Advertisement
విద్య వ్యవస్థ,వ్యవసాయ, కార్మిక సమస్యల పై ప్రజలని కలుస్తున్నానని..ప్రభుత్వంపై కార్మికులు, రైతుల్లో మంచి స్పందన వస్తుందని పేర్కొన్నారు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. నేను చూసినంతవరకు ప్రభుత్వం పై వ్యతిరేకత లేదని.. మంచిపనులు జరగాలంటే కొంత ఓపిక కావాలని అన్నారు. వైసీపీ నాలుగేళ్ల ప్రభుత్వంలో రెండేళ్లు కరోనా కష్ట కాలం ఉంది… కరోనా తో ప్రపంచం అంత స్తంభించి పోయిందన్నారు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.
Advertisement
అలాంటి సమయం లో కూడా ఏపీ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసింది…క్షేత్రస్థాయిలో రైతుల కోసం పంట కొనుగోలు కేంద్రాలు,నాణ్యమైన విత్తనాల సరఫరా లో కొన్ని సమస్యలు నా దృష్టికి వచ్చాయని చెప్పారు. నా పరిధిలో వాటికి పరిష్కారానికి అవసరమైన సూచనలు చేస్తాను…వాలంటీర్ వ్యవస్థ పై ప్రజలు సంతృప్తి గా ఉన్నారన్నారు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.