టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పారు. ఇంటర్నేషనల్ టి20 లీగ్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడడానికి సిద్ధమని చెప్పారు. ఇటీవల రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరిన సంగతి మనకి తెలుసు ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షం లో పార్టీ జెండాని కప్పుకున్నారు అంబటి రాయుడు. కానీ కొన్ని రోజుల్లోనే రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు అంబటి రాయుడు. వైఎస్ఆర్సిపి పార్టీ నుండి బయటకు వచ్చేసారు.
Advertisement
కొంత కాలం నేను రాజకీయాలు కి దూరంగా ఉండబోతున్నానని ప్రకటించారు భవిష్యత్తు కార్యాచరణని త్వరలో ప్రకటిస్తానని అంబటి రాయుడు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అయితే ఈ విషయంపై అంబటి రాయుడు మీద ఎన్నో విమర్శలు వచ్చాయి. రాజకీయాల్లో తొందర పాటు నిర్ణయాలు తీసుకోకూడదని ఇలా దూకుడుగా వ్యవహరించకూడదని అంతా అన్నారు ఇలా దూకుడుగా వ్యవహరించడం వలన క్రికెట్ కెరీర్ ని నాశనం చేసుకున్నారని పొలిటికల్ ఇన్నింగ్స్ లో డక్ అవుట్ అయ్యాడని కామెంట్లు వచ్చాయి.
Advertisement
అయితే రాజకీయాలనుండి ఎందుకు తప్పుకున్నాను అనే దాని గురించి కారణాలని వివరిస్తూ అంబటి రాయుడు ట్వీట్ చేశారు. ప్రొఫెషనల్ క్రికెట్ ఆడే టైం లో రాజకీయాలకు దూరంగా ఉండాలని, అందుకోసమే పార్టీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దుబాయ్ వేదికగా జనవరి 20 నుండి జరగనున్న ఇంటర్నేషనల్ టి20 లీగ్ లో ముంబై ఇండియన్స్ తరఫున బరి లోకి దిగబోతున్నాడు రాయుడు. ప్రొఫెషనల్ ఆటను ఆడే టైంలో నేను రాజకీయాల్లో ఉండకూడదు అని పోస్ట్ చేశారు. ఐపీఎల్ లో గత ఏడాది అంబటి నాయుడు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడారు. 2023 ఐపీఎల్ సీజన్ తన ఆఖరిదని ప్రకటించారు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!