టాలీవుడ్ లోని టాప్ ప్రొడ్యూసర్ లలో అల్లు అరవింద్ కూడా ఒకరు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించారు. కేవలం తాను నిర్మించిన సినిమాలే కాకుండా చిన్న సినిమాలను కూడా తమ బ్యానర్ లో విడుదల చేస్తూ అరవింద్ కొత్త వారిని కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే రైటర్ పద్మభూషణ్ సినిమాను ఆయన విడుదల చేశారు.
Advertisement
ఈ సినిమాలో సుహాస్ హీరోగా నటించగా షణ్ముక్ ప్రశాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఈవెంట్ లో అల్లు అరవింద్ పాల్గొని ఆసక్తికర కామెంట్ లు చేశారు. నేను ఈ వయసులో కూడా ఎగురుతూ ఉన్నానంటే దానికి కారణం ప్రతిరోజూ యంగ్ స్టార్స్ తో తిరగటమే అని చెప్పారు.
Advertisement
ఈ సినిమాను చూడాలని తనకు సూచించారని చెప్పారు. సినిమా చూసిన తర్వాత నే విడుదల చేయాలి అని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఈ సినిమాలో ఆడవాళ్ళ గొప్పదనం గురించి ఉందని అన్నారు. ప్రతి ఆడపిల్ల తమ పేరెంట్స్ ను ఈ సినిమాకు తీసుకెళ్లాలి అని అన్నారు. తల్లి తండ్రులు అన్నా దమ్ముల్లు అమ్మాయిలను చూసే కోణం మారాలని అన్నారు.
ఆడపిల్లల మసుకో ఏముందో తొంగి చూసి వారి కోరికలు తీర్చడానికి ఈ సినిమా ఉపయోగపడుతుందన్నారు. అంతే కాకుండా తమ కోడలు బన్నీ భార్య స్నేహ పని చేయాల్సిన అవసరం ఏముందని అన్నారు. సంపనుల కుటుంబం లో పుట్టిందని స్టార్ ను పెళ్లి చేసుకుందని అన్నారు. అయినప్పటికీ పని చేస్తుందని చెప్పారు. ఈ సినిమా చూసిన తర్వాత నువ్వేం చేయాలని అనుకుంటున్నావ్ అని తన భార్యను అడిగానని చెప్పారు.