మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ హీరోలుగా కలిసి నటించిన మొదటి సినిమా ఆచార్య. గతంలో వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ అది ఐదు పది నిమిషాలు మాత్రమే…. కానీ ఆచార్య సినిమాలో రామ్ చరణ్ దాదాపు 40 నిమిషాల పాటు ఉన్నారు. దాంతో ఆచార్య మల్టీస్టారర్ సినిమా అనే చెప్పాలి. ఇక తండ్రి కొడుకులు కలిసి నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Advertisement
నిజానికి ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా విజృంభణ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. దాంతో ఈ సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. కానీ ఈ రోజు సినిమా విడుదల కాగా ఆ అంచనాలు తారుమారయ్యాయి. సినిమాకు బెనిఫిట్ షో నుండి నెగిటివ్ టాక్ వస్తోంది. సోషల్ మీడియాలో ఆచార్యను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమాకు వెళ్లి పడుకున్నామని కొందరు కామెంట్ చేస్తుంటే…. మరికొందరు సన్ ఆఫ్ ఇండియా సినిమాతో ఆచార్యను పోలుస్తున్నారు.
Advertisement
అంతే కాకుండా ఈ సినిమా ఒకప్పుడు రావాల్సిన సినిమా అని రొట్ట రొటీన్ కథ అని కొరటాలను ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాపై మెగా ఫ్యామిలీకి చెందిన అల్లుఅర్జున్ పేరుతో కూడా ట్రోల్స్ చేయడం ఆశ్చర్యకరం. అంతేకాకుండా మెగా ఫ్యామిలీ ని ఆదుకునేది అల్లు అర్జున్ ఒక్కడే అంటూ కామెంట్స్ కనిపిస్తున్నాయి. ఇటీవల వచ్చిన సినిమాలలో కొండ పొలం, రిపబ్లిక్, భీమ్లా నాయక్, గని సినిమాలు కూడా విజయం సాధించలేదని కామెంట్ లు చేస్తున్నారు.
అంతే కాకుండా ఇప్పుడు ఆచార్యుకు కూడా నెగెటివ్ టాక్ వస్తుందని డిజాస్టర్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. కానీ మెగా ఫ్యామిలీ కి ఒక కాపరి ఉన్నాడని అతనే అల్లు అర్జున్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ కామెంట్లను అల్లు అర్జున్ అభిమానులు చేస్తున్నారా….? లేదంటే పనిగట్టుకుని ఎవరైనా చేస్తున్నారా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.
Kondapalem – flop
Republic – flop
BheemlaNayak – average
Ghani – disaster#Acharya – disaster reports***
Mega Family DandayatraBut oka kAApari unnadu..
Saviour @alluarjun 🔥— N BHARATH NTR ᴺᵀᴿ³⁰ (@NBharathNtr) April 29, 2022