Home » ఆ స‌మ‌యంలో న‌న్ను నేనే తిట్టుకున్నా..అల్ల‌రి న‌రేష్ ఎమోష‌న‌ల్..!

ఆ స‌మ‌యంలో న‌న్ను నేనే తిట్టుకున్నా..అల్ల‌రి న‌రేష్ ఎమోష‌న‌ల్..!

by AJAY
Ad

టాలెంటెడ్ డైరెక్టర్ రవిబాబు దర్శకత్వంలో రూపొందిన అల్లరి మూవీతో వెండితెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకున్న అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో ఎక్కువ శాతం కామెడీ ప్రాధాన్యత ఎక్కువగా ఉన్న సినిమాలలో నటించి తన కామెడీ టైమింగ్ తో ఎంతోమంది ప్రేక్షకులను నవ్వించిన నరేష్ ప్రస్తుతం మాత్రం ఎక్కువ శాతం వైవిధ్యమైన కథలతో రూపొందే సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు.

Advertisement

అందులో భాగంగా ఇప్పటికే నాంది … ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాలలో నటించి తన నటనతో నరేష్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తాజాగా నరేష్ “ఉగ్రం” అనే సినిమాలో హీరోగా నటించాడు. విజయ్ కనకమెడల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నరేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను మే 5 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం నరేష్ వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు.

Advertisement

ALLARI NARESH

ALLARI NARESH

అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్ కు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. నరేష్ కు తాజా ఇంటర్వ్యూలో భాగంగా గతంలో ఎన్నో స్పూఫ్ కథల్లో నటించారు. మళ్లీ అలాంటి కథల్లో నటించే అవకాశం ఉందా అనే ప్రశ్న ఎదురైంది… ఈ ప్రశ్నకు నరేష్ సమాధానం ఇస్తూ … అలాంటి ఉద్దేశం లేదు. ఒకరిని అనుకరించడం అసలు నటన ఏ మాత్రం కాదు. కొన్ని స్పూఫ్స్ సన్నివేశాలు చేసేటప్పుడు నన్ను నేను తిట్టుకున్నాను. ఒకరిని అనుకరించడం వల్ల తమదైన నటనను ప్రదర్శించే అవకాశం ఉండదు అని చాలా బాధపడ్డా అని నరేష్ చెప్పుకొచ్చాడు.

Visitors Are Also Reading