తెలుగు సినీ హాస్యనటుడు సత్యం రాజేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అద్భుతమైన కామిడీ టైమింగ్ తో ఎంతోమంది హీరోల సరసన ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించాడు. ఇతని స్వస్థలం విశాఖపట్నం. చిన్ననాటి నుంచి సినిమాలపై ఉన్న ఇష్టంతో ఎలాగైనా ఇండస్ట్రీలోకి రావాలని విలన్ గా సినిమాల్లో నటించాలని అనుకునేవారట. కానీ అతన్ని చూసి నువ్వు విలన్ ఏంటి అని అంతా నవ్వేవారట. ఎంత ప్రయత్నించినప్పటికీ విలన్ గా అవకాశాలు ఏ డైరెక్టర్ కూడా ఇవ్వలేదట.
దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని ప్రారంభించాడు. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన నీ స్నేహం సినిమాలో రాజేష్ మొదటగా నటించాడు. ఆ సినిమా అనంతరం రాజేష్ కామెడీ టైమింగ్ కి ఎన్నో అవకాశాలు వచ్చాయి. దాదాపు 400కు పైగా చిత్రాల్లో నటించాడు. రాజేష్ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం ‘సత్యం’. ఆ సినిమా అనంతరం రాజేష్ కాస్త సత్యం రాజేష్ గా మారిపోయాడు. అయితే ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ ఆలీ గారు చేయాల్సిందట. కానీ అనుకోని కారణాలవల్ల రాజేష్ ఆ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆలీగారు అనుకున్న డేట్స్ ప్రకారం షూటింగ్ కి రాలేకపోయాడు.
Advertisement
Advertisement
తాను దుబాయ్ లో షూటింగ్ ఉండడం వల్ల దుబాయ్ కి వెళ్లి షూటింగ్ పూర్తిచేసుకుని ఇండియాకు తిరిగి వస్తున్న సమయంలో అనుకోని కారణాలతో ఫ్లైట్ రెండు రోజులు వాయిదా పడిందట. రెండు రోజుల పాటు దుబాయ్ నుంచి ఇండియాకు ఎలాంటి ఫ్లైట్స్ అందుబాటులో లేకపోవడం వల్ల షూటింగ్ లేట్ అవుతుందని భావించిన డైరెక్టర్ ఆలీగారి స్థానంలో రాజేష్ ని నటించమని చెప్పారట. దీంతో ఆ పాత్రలో రాజేష్ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం పొలిమేర సినిమాలో హీరోగా అద్భుతంగా నటించాడు రాజేష్.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!