సెలెబ్రిటీలలో చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకున్న వారే ఉన్నారు. అందులోను వారు పబ్లిక్ ఫిగర్స్ కావడంతో వారి గురించిన ప్రతీ విషయం వైరల్ అయిపోతూ ఉంటుంది. అయితే.. ఈ ఆర్టికల్ లో టాలీవుడ్ ఇండస్ట్రీ కి సంబంధించి ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిలో ఏ జంటకి ఎంత ఏజ్ గ్యాప్ ఉందొ ఈ ఆర్టికల్ లో చూసేద్దాం
నాగచైతన్య సమంత:
Advertisement
వీరిద్దరూ ఏ మాయ చేసావే సినిమాతో కలిసి పని చేసారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే.. పెళ్లి చేసుకున్న తరువాత నాలుగు సంవత్సరాలకే వీరిద్దరూ విడిపోయారు. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఒక సంవత్సరం మాత్రమే. నాగ చైతన్య సమంత కంటే ఒక సంవత్సరం పెద్దవాడు.
సూర్య జ్యోతిక:
వీరిద్దరికి టాలీవుడ్ లో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. సూర్య, జ్యోతిక కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జ్యోతిక సూర్య కంటే మూడేళ్లు చిన్నది.
వరుణ్ సందేశ్ వితిక:
Advertisement
హ్యాపీ డేస్ సినిమాతో సూపర్ పాపులారిటీ తెచ్చుకున్న వరుణ్ సందేశ్ వితికాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వరుణ్ సందేశ్ కంటే వితిక మూడు సంవత్సరాలు చిన్నది.
రామ్ చరణ్ ఉపాసన:
వీరిద్దరూ కూడా చిన్నతనం నుంచే ప్రేమించుకున్నారు. రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయితే.. ఉపాసన బిజినెస్ వుమన్ గా సక్సెస్ అయ్యారు. రామ్ చరణ్ కంటే ఉపాసన ఐదేళ్లు చిన్నది.
నాగార్జున అమల:
మొదట దగ్గుబాటి వారి అమ్మాయి లక్ష్మిని పెళ్లి చేసుకున్న నాగార్జున ఆ తరువాత విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి మధ్య వయసు వ్యత్యాసం తొమ్మిది సంవత్సరాలు.
జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మి ప్రణతి:
వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహమే. వీరిద్దరికి మధ్య వయసు వ్యత్యాసం కూడా ఇప్పటి యంగ్ కపుల్స్ తో పోలిస్తే ఎక్కువే. లక్ష్మి ప్రణతి జూనియర్ ఎన్టీఆర్ కంటే 8 సంవత్సరాలు చిన్నది.