తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా కొనసాగారు సిద్ధార్థ్. బాయ్స్, బొమ్మరిల్లు,నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాల్లో చేసి సూపర్ హిట్ కొట్టిన ఆయన ఇండస్ట్రీలో బిజీ హీరోగా మారారు. కెరియర్ మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు ఆయన చేసిన కొన్ని పనుల వల్ల సినిమాలు రాకుండా పోయాయి. అలాంటి సిద్ధార్థ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో సిద్ధార్థ్ మరియు అతిథి రావు హైదరి ప్రేమలో ఉన్నారని చాలా వార్తలు వినిపిస్తున్నాయి.
Advertisement
వీరిద్దరూ కలిసి బయట తిరుగుతూ చాలాసార్లు మీడియా కంటికి చిక్కారు. ఆ సమయంలో వీరు మా మధ్య ఏం లేదనే విషయాన్ని ప్రకటించారు. అయితే తాజాగా శర్వానంద్ ఎంగేజ్మెంట్ లో ఇద్దరు కలిసి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే శర్వానంద్ అతిధి సిద్ధార్థ కలిసి మహాసముద్రం సినిమాలో నటించారు. ఇక అప్పట్నుంచి వీరి మధ్య స్నేహం ఏర్పడి అధికాస్త ప్రేమగా మారింది.
Advertisement
ఇటీవల కాలంలో బాలకృష్ణ షోలో శర్వానంద్ వీరి రిలేషన్షిప్ గురించి మాట్లాడుతూ వారి మధ్య మంచి బంధం ఉందని హింట్ ఇచ్చారు. ఈ తరుణంలోనే శర్వానంద్ ఎంగేజ్మెంట్ కి ఇద్దరు కలిసి భార్య భర్తల్లా రావడంతో సిద్ధార్థ అతిధి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ తరుణంలోనే వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. శర్వానంద్ పెళ్లి తర్వాత వీరి పెళ్లి జరుగుతుందని డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. మరి దీనిపై సిద్ధార్థ్ అతిధి స్పందిస్తే కానీ అసలు విషయం బయటకు రాదు.
also read: