Home » 50 ఏళ్ళు దాటుతున్న ఇప్పటికి పెళ్లి కానీ నటీమణులు ! ప్రేమ వైఫల్యమే కారణమా ?

50 ఏళ్ళు దాటుతున్న ఇప్పటికి పెళ్లి కానీ నటీమణులు ! ప్రేమ వైఫల్యమే కారణమా ?

by AJAY
Ad

ఏ వ‌య‌సులో జ‌ర‌గాల్సిన ముచ్చ‌ట ఆ వ‌య‌సులో జ‌ర‌గాలి అంటూ ఉంటారు. అంటే ఈ సామెత‌ను ముఖ్యంగా పెళ్లి కోసం వాడుతుంటారు. అయితే సినిమా ఇండ‌స్ట్రీలో కొంత‌మంది హీరోయిన్ లు మాత్రం పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉండిపోయారు. ఏజ్ బార్ అవుతున్నా పెళ్లికి నో చెబుతున్నారు. అలా సింగిల్ గా ఉండిపోయిన హీరోయిన్ లు ఎవరో..? ఎందుకు పెళ్లికి నో చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం…ఒక‌ప్ప‌టి హీరోయిన్ సితార ప్ర‌స్తుతం క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తోంది.

ALSO READ : దర్శకుడి మాటలు వినక అట్టర్ ప్లాప్ అయినా మెగా స్టార్ సినిమా ఏది ? ఎందుకు చిరు వినిపించుకోలేదు ?

Advertisement

ఈ ముద్దుగుమ్మ ఏజ్ బార్ అవుతున్నా పెళ్లి చేసుకోలేదు. త‌మిళ న‌టుడు ముర‌ళిని సితార గాఢంగా ప్రేమించింద‌ని కానీ అతడితో పెళ్లిజ‌ర‌గ‌కపోవ‌డం వ‌ల్ల సింగిల్ గా ఉండిపోయిందని టాక్ ఉంది. టాలీవుడ్ న‌టి నిర్మ‌ల కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు. నిర్మల ఒక‌ప్పుడు అక్క వ‌దిన పాత్ర‌లు చేయ‌గా ప్ర‌స్తుతం తల్లి పాత్ర‌ల‌లో న‌టిస్తోంది.

Advertisement

అయితే ఒక‌ప్ప‌టి త‌మిళ స్టార్ ఎంజీఆర్ తో నిర్మ‌ల ప్రేమాయ‌ణం న‌డిపించింది అనే టాక్ ఉంది. అంతే కాకుండా అత‌డివ‌ల్లే పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉండిపోయిందని టాక్. అదే విధంగా ఎంజీఆర్ వ‌ల్ల పెళ్లికి దూర‌మైన మ‌రో హీరోయిన్ జ‌య‌ల‌లిత‌.

ఈ హీరోయిన్ కూడా ఒక‌ప్పుడు ఎంజీఆర్ తో మ‌రియు శోభ‌న్ బాబు తో ప్రేమాయ‌ణం న‌డిపించింది. కానీ చివ‌రికి పెళ్లి చేసుకోకుండానే జీవితాంతం గ‌డ‌ప‌టంతో పాటూ తుదిశ్వాస విడిచింది. ఇదిలా ఉంటే ముత్యాల ముగ్గు సినిమా హీరోయిన్ సంగీత కూడా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉండిపోయింది. ఈ హీరోయిన్ కూడా ఎంజీఆర్ ప్రేమ‌కే బ‌లైపోయింద‌ని టాక్ ఉంది.

actress tabu

actress tabu

మ‌రోవైపు అందాల తార ట‌బు కూడా సింగిల్ గానే ఉండిపోయింది. టబు టాలీవుడ్ హీరో నాగార్జున తో ప్రేమాయ‌ణం న‌డిపింద‌ని ఆయ‌న‌తో పెళ్లి జ‌ర‌గలేద‌ని సింగిల్ గా ఉండిపోయింద‌ని ట‌క్ ఉంది. అంతే కాకుండా ఈ హీరోయిన్ అజ‌య్ దేవ్ గ‌న్ తో కూడా ప్రేమాయ‌ణం న‌డిపించింద‌ని బాలీవుడ్ లో టాక్ ఉంది.

ALSO READ : అప్పట్లో ఎన్టీఆర్ కి సాధ్యమైన రికార్డు మళ్ళీ బాలకృష్ణ సాధించారా ? కేవలం నందమూరి వారికే సొంతం !

Visitors Are Also Reading