కొన్ని సార్లు ఎలాంటి ఆధారాలు లేకున్నా ఇండస్ట్రీలో గాసిప్స్ వినిపిస్తుంటాయి. హీరోయిన్ తో హీరో పెళ్లి అంటూ వార్తలు వినిపిస్తుంటాయి. అయితే ఇప్పడే కాకుండా ఒకప్పడు కూడా ఇండస్ట్రీలో ఇలాంటి వార్తలు వినిపించేవి. అలా అప్పట్లో ఓ వార్త ఏకంగా మ్యాగజైన్ లలో వచ్చింది. ఆ వార్త ఏంటి ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం. కమెడియన్ అలీ హీరోగా కొన్ని సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. అలా అలీ నటించిన సినిమాల్లో అల్లరి పెళ్లి కొడుకు సినిమా కూడా ఒకటి.
Advertisement
ఈ సినిమాలో అలీకి హీరోయిన్ శుభ శ్రీ నటించింది. శుభ శ్రీ మరెవరో కాదు ఒకప్పటి హీరోయిన్ మల శ్రీకి ఆమె సోదరి అవుతుంది. ఇక వీరిద్దరూ అక్కా చెల్లెల్లు కాగా హీరోయిన్ లుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. కాగా తాజాగా శుభశ్రీ అలీతో సరదాగా అనే టీవీ షోకు వచ్చింది. ఈ షోకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలను చెప్పింది. తన అక్క మల శ్రీ సినిమాలు చేస్తున్న సమయంలో తనకు స్కూల్ కు వెళ్లడం ఇష్టం లేక సినిమాల్లోకి వచ్చానని చెప్పింది.
Advertisement
అంతే కాకుండా తన అసలు పేరు భారతి పాండే అని చెప్పింది. తనకు పెళ్లి అయిందని తన భర్త తన కంటే సన్నగా ఉంటారని చెప్పింది. తను ఆడుకుంటున్న సమయంలో తన భర్త వచ్చి లైటింగ్ కొట్టేవాడని అలా మొదలై ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నామని తెలిపింది. అంతే కాకుండా తను కేవలం ఏడవ తరగతి మాత్రమే చదువుకున్నట్టు తెలిపింది. ఆ తరవాత సినిమాలకు గుడ్ బై చెప్పానని పేర్కొంది.
దాంతో అలీ నేను ఒక తరగతి ఎక్కువ 8 చదివానని అన్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ సమయంలో తాము పెళ్లి చేసుకునే సీన్ కు సంబంధించిన ఫోటో బయటకు వచ్చిందని చెప్పాడు. ఇక ఆ ఫోటోను ఓ మ్యాగజైన్ లో అలీతో హీరోయిన్ పెళ్లి అంటూ ఫోటో పడిందని పేర్కొన్నాడు. అంతే కాకుండా ఆ మ్యాగజైన్ ను తన మామగారు చూసి మీ భర్తకు మళ్లీ చేసారు అంటూ తన భార్యకు చూపించాడని తెలిపాడు. దాంతో శుభ శ్రీ నిజమా అంటూ నవ్వేసింది.