టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన భామలను ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నారు. రోజా, ఇంద్రజ లాంటి హీరోయిన్లు ఇప్పటికీ బుల్లితెరపై సందడి చేస్తుంటే మరి కొందరు సినిమాల్లో బిజీగా ఉన్నారు. మరికొందరైతే పెళ్లి చేసుకుని పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అలా పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్లలో కుర్రాళ్ళ ఫేవరెట్ రంభ కూడా ఉన్నారు. అప్పటి హీరోయిన్ల లో అందంతో ఫిదా చేసి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ రంభ.
Advertisement
తన అందంతో మొదటి సినిమాకే రంభ ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, జగపతిబాబు లాంటి స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా రంభ సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది. తమిళ స్టార్ హీరోలు అందరితోనూ రంభ సినిమాలు చేసి అభిమానులను సంపాదించుకుంది.
Advertisement
రంభ చివరిసారిగా 2008లో దొంగ సచ్చినోళ్లు అనే సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించింది. ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకే కాకుండా సినిమా ఇండస్ట్రీకి దూరం అయింది. కొన్నాళ్ల పాటు రంభ బుల్లితెరపై కూడా సందడి చేసింది. టీవీ షోలకు జడ్జ్ గా వ్యవహరించింది. ఇక 2010 లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్ర కుమార్ ను వివాహం చేసుకుంది. ఇంద్ర కుమార్ రంభ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.
రంభ సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. అప్పుడప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే అప్పటికీ… ఇప్పటికీ రంభా పూర్తిగా మారిపోయింది కానీ అందం మాత్రం తగ్గలేదు. అంతే కాకుండా రంభ రీఎంట్రీ ఇచ్చినా సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయి.