Home » గుర్తుప‌ట్ట‌లేనంత‌గా మారిపోయిన ప‌వ‌న్ హీరోయిన్…ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా..?

గుర్తుప‌ట్ట‌లేనంత‌గా మారిపోయిన ప‌వ‌న్ హీరోయిన్…ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా..?

by AJAY
Ad

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌క్క‌న హీరోయిన్ అంటే మామూలు క్రేజ్ ఉండ‌దు. ఆయ‌న‌కు జోడీగా న‌టిస్తే ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోవాల్సిందే. ఆమె సోష‌ల్ మీడియా ఐడీల‌ కోసం నెటిజ‌న్ లు వెత‌కాల్సిందే. ఇక హీరోయిన్ లు కూడా త‌మ కెరీర్ లో ఒక్క‌సారి అయినా ప‌వ‌న్ ప‌క్కన న‌టించాల‌ని క‌ల‌లు కంటూ ఉంటారు. అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ తో జోడీ క‌ట్టినా ఆ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఆ త‌ర‌వాత హీరోయిన్ ల భ‌విష్య‌త్ ఎలా ఉంటుందో చెప్ప‌లేం.

Advertisement

ఇదిలా ఉంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించి ఫ్లాప్ అయిన సినిమాల‌లో బాలు సినిమా కూడా ఒక‌టి. ఈ సినిమా 2005 లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. క‌రునాక‌ర‌ణ్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇక ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్ లు న‌టించారు. వారిలో ఒక‌రు నేహా ఒబేరాయ్. మొద‌టి సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ ప్రేక్ష‌కుల‌ను త‌న‌వైపు తిప్పుకున్నా ఈ సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో ఆ త‌ర‌వాత ఆఫ‌ర్ ల‌ను అందుకోలేక‌పోంది.

Advertisement

దాంతో టాలీవుడ్ లో ఒకే సినిమాతో స‌రిపెట్టుకుంది. కానీ బాలీవుడ్ లో ఈ ఎంఐ, బ్ర‌హ్మాస్త్రంతో పాటూ మ‌రికొన్ని సినిమాల‌లో న‌టించింది. అంతే కాకుండా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేయ‌డంతో చివ‌ర‌కు బాలీవుడ్ హీరోయిన్ గానే ముద్ర‌ప‌డిపోయింది. అయితే బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా రానించ‌లేక‌పోయింది.

అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తూ ఇండ‌స్ట్రీకి ద‌గ్గ‌ర‌గానే ఉంటుంది. అంతేకాకుండా టీవీ యాడ్స్ లో న‌టిస్తోంది. ఇక ప్ర‌స్తుతం నేహా గుర్తుప‌ట్ట‌లేనంత‌గా మారిపోయింది. అందం ఫిట్నెస్ ను అలానే మెయిన్టైన్ చేస్తోంది. ప్ర‌స్తుతం నేహా ఒబేరాయ్ లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవ్వ‌డంతో ప‌వ‌న్ హీరోయిన్ ఇలా మారిపోయిందా అని షాక్ అవుతున్నారు.

ALSO READ : మొగ‌లిరేకులు సీరియ‌ల్ హీరోయిన్ మేధా గుర్తుందా…ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా..?

Visitors Are Also Reading