ఒకప్పుడు స్టార్ హీరోయిన్ లుగా రానించిన చాలా మంది ముద్దుగుమ్మలు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ వారి పనులు వారు చూసుకుంటున్నారు. కొంతమంది ఫ్యామిలీతో బిజీగా ఉంటే మరికొంతమంది వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటూ బిజీగా ఉంటున్నారు. అలా సినిమాలకు దూరమైన బ్యూటీలలో లైలా కూడా ఒకరు.
Advertisement
లైలా దుష్మన్ దునియాకా అనే బాలీవుడ్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగపెట్టింది. అంతే కాకుండా ఎగిరే పావురం సినిమాతో లైలా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక మొదటి సినిమాతోనే లైలా తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అల్లరి పిల్లగా కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పించింది.
Advertisement
ఆ తరవాత చాలా సినిమాలలో నటించి అభిమానులను సంపాదించుకుంది. ఇక లైలా సినిమాల్లో చేస్తున్న సమయంలోనే పెళ్లి చేసుకుంది. లయ తాను ప్రేమించిన వ్యాపారవేత్త మెహ్దీన్ తో ఎనిమిదేళ్ల పాటూ డేటింగ్ చేసి అతడినే పెళ్లి చేసుకుంది. పెళ్లి తరవాత వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. ఇక సినిమాలకు దూరమైనప్పటికీ ఈ అందగత్తె సీరియల్స్ లో నటించింది.
అంతే కాకుండా రీసెంట్ గా తమిళ హీరో కార్తీ నటించిన సర్దార్ సినిమాలో నటించి మరోసారి ప్రేక్షకులకు హాయ్ చెప్పింది. అంతే కాకుండా ప్రస్తుతం లైలా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తోంది.ఇక ఒకప్పుడు తెలుగులో నటించిన ఈ ముద్దుగుమ్మ మంచి కథలు వస్తే తెలుగులోనూ నటిస్తానని చెబుతోంది. మరి తెలుగులో రీఎంట్రీ ఇస్తే ఈ హీరోయిన్ కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.
ALSO READ : దక్షిణాఫ్రికాకు శుభవార్త.. మూడేళ్ల తరువాత ఆ క్రికెటర్ రీ ఎంట్రీ..!