మనిషికంటే డబ్బుకే విలువ ఎక్కువ ఉండే లోకమిది. డబ్బు ఉన్నంత వరకే మనవాళ్లు ఆ తరవాత అంతా పరాయివాళ్లే. ఇది అనే సందర్భాల్లో రుజువు అయ్యింది కూడా. ముఖ్యంగా ఉదయ్ కిరణ్ మరణించిన తరవాత ఆయన బాడీ వెంట ఒక్కరు కూడా లేరు. ఉదయ్ కిరణ్ బాడీ ఆస్పత్రి వద్ద ఉంటే టాలీవుడ్ నుండి చూడ్డానికి వెళ్లింది మాత్రం ఒక్కరిద్దరు మాత్రమే.
Advertisement
కానీ ఉదయ్ కిరణ్ స్టార్ గా ఉన్నప్పుడు ఆయన వెంట వందల మంది కనిపించేవారు. ఇక ఒకప్పటి నటి కల్పనారాయ్ విషయంలోనూ అలాగే జరిగిందట. కల్పనారాయ్ ఓ సీత కథ అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. దాదాపు కల్పనారాయ్ 400లకు పైగా సినిమాల్లో నటించారు. ముఖ్యంగా కామెడీ రోల్స్ తో ఆమె ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. కానీ కల్పనారాయ్ డబ్బులు మాత్రం సంపాదించుకోలేదట.
Advertisement
ఆమె నటించిన సినిమాల్లో కొన్ని సినిమాలకు డబ్బులు కూడా ఎగ్గొట్టారట. అంతే కాకుండా కెరీర్ పీక్స్ లో లేకపోతే కేవలం పేరు కోసం ఉచితంగా కూడా సినిమాలు చేయాల్సి వస్తుందట. ఇక సంపాదించుకున్నదాంట్లో కూడా లేని వారికి సాయం చేయడం అడిగిన వారికి లేదనకుండా ఇవ్వడం కూడా కల్పనారాయ్ ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేశాయట. అంతే కాకుండా కల్పనారాయ్ అనారోగ్యం భారినపడినప్పుడు మాత్రం ఎవరివద్దా సాయం కోసం చేతులు చాచలేదట.
దాంతో మందులు కూడా కొనుక్కోలేని స్థితికి కల్పనా రాయ్ చేరుకున్నారు. చివరికి కల్పనారాయ్ అంత్యక్రియలకు కూడా డబ్బులు లేవంటే ఆమె ఎలాంటి స్థితిలో మరణించారో అర్థం చేసుకోవచ్చు. ఇక స్టార్ హీరోల సినిమాల్లో నటించినప్పటికీ కల్పనారాయ్ చివరిరోజుల్లో సాయం చేసిన హీరోలు కూడా లేరు. దాంతో దిక్కుతోచని స్థితిలో కల్పనారాయ్ అంత్యక్రియలు జరిగాయి.