తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ ఇండియాలో నేచురల్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది జయసుధ. తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి అప్పటి స్టార్ హీరోలు అందరితో ఆమె తెరను పంచుకుంది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతూ వస్తోంది. అలాంటి జయసుధ జీవితంలో అనేక విచిత్ర సంఘటనలు ఉన్నాయి. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జయసుధకు అసలు సినిమాలంటే ఇష్టం లేదట. మరి అలాంటి జయసుధ ఇంతటి స్టార్ హీరోయిన్ గా ఎలా ఎదిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
జయసుధ తల్లి పేరు భోగా బాయ్, ఆమె కూడా సినిమాల్లో నటించేది. తన తండ్రి పేరు రమేష్, జయసుధ అసలు పేరు సుజాత కానీ ఇండస్ట్రీలో జయసుధ గా మారింది. అయితే జయసుధకు సినిమాలో నటించడం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదట. నటించడం కాదు చూడటానికి కూడా అంతగా ఇష్టం ఉండేది కాదట. అలాంటి జయసుధ ఇండస్ట్రీలో ఎలా ఎదిగింది అనేది కృష్ణ వైఫ్ విజయనిర్మల తన పుస్తకంలో రాశారట..
Advertisement
జయసుధ పుట్టినప్పుడు తన తండ్రి రమేష్ జాతకాన్ని రాయించారట. అందులో జయసుధ గొప్ప నటి అవుతుందని ఎంతో స్టార్డం సంపాదించుకుంటుందని మంచి పేరు వస్తుందని అంతకు మించిన సంపాదన వస్తుందని చెప్పారట జ్యోతిష్యుడు. ఆయన చెప్పిన విధంగానే జయసుధ ఇండస్ట్రీలో పండంటి కాపురం అనే మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చి తర్వాత ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదిగి స్టార్ హీరోయిన్ గా మారింది.
also read:http://‘పోకిరి’లోని “గలగల పాడుతున్న గోదారిలా” పాటను ఆ చిత్రం నుంచి కాపీ కొట్టారని మీకు తెలుసా..?