టాలీవుడ్ లో హంసా నందిని పేరు తెలియని వారు ఉండరు. ఐటమ్ సాంగ్స్ తో ఈమె బాగా పాపులర్ అయింది. ఈ బ్యూటీ దాదాపు పాతికకి పైగా సినిమాలు చేసింది. ఇందులో హీరోయిన్ గా చేసింది చాలా తక్కువ. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసింది. మరికొన్ని సినిమాల్లో ఫుల్ లెంగ్త్ రోల్స్ ని చేసింది. కానీ ఈ అమ్మకి పేరు తీసుకొచ్చింది మాత్రం ఐటెం సాంగ్స్.
2013 లో వచ్చిన అత్తారింటికి దారేది, మిర్చి సినిమాలో చేసిన ఐటెం సాంగ్స్ హంసా నందిని కి మంచి క్రేజ్ ని తెచ్చి పెట్టాయి. ఆ తర్వాత లెజెండ్ మూవీలో నందమూరి బాలకృష్ణ తో ఆడిపాడింది. చివరిగా 2018లో పంతం సినిమాలో హంసానందిని కనిపించింది. ఆ తర్వాత ఈ అమ్మడు పెద్దగా తెరపై కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే హంస ఘతేడాది ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది.
Advertisement
Advertisement
తాను క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. వంశపారంపర్యంగా వచ్చే రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న హంస నందిని కొన్ని నెలల తర్వాత క్యాన్సర్ నుంచి కోలుకుంది. అయితే తన తల్లి కూడా ఇదే జబ్బుతో చనిపోయినట్లు గతంలోనే వెల్లడించింది హంస. అయితే తాజా ఆమె క్యాన్సర్ నుంచి బయటపడి మళ్ళీ షూటింగ్ కి హాజరైనట్లు ఓ సెట్ లో దిగిన ఫోటోలు అభిమానులకు షేర్ చేసింది. “మళ్లీ కెమెరా ముందుకు రావడం సంతోషంగా భావిస్తున్నా. నా పుట్టినరోజును నా సహనటులు, చిత్ర బృందంతో జరుపుకుంటున్నాను. మీ అందరి ప్రేమకు థాంక్స్ చెప్పకుండా ఉండలేను” అని ట్వీట్ చేసింది. దీనితో ఆమెకు ప్రశంసల వెల్లువ కురుస్తుంది.
ఇవి కూడా చదవండి : కన్నడ ఇండస్ట్రీ బ్యాన్.. లోపల జరిగేది వేరంటూ నోరు విప్పిన రష్మికా మందన్న