బ్యాగ్రౌండ్ ఉంటే తప్ప సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో నటించే అవకాశాలు రావు. దాంతో చాలా మంది ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ కెరీర్ ప్రారంభంలో చిన్నచిన్న పాత్రలు చేస్తుంటారు. అలా చిన్న పాత్రలు చేసి ప్రస్తుతం స్టార్ లు గా ఎదిగినవాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. తమిళ స్టార్ విజయ్ సేతుపతి ఒకప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ గా నటించగా ప్రస్తుతం ఆయన విలక్షణ నటుడుగా గుర్తింపు సంపాదించుకున్నారు.
ALSO READ : ఆయన మరణిస్తారని శ్రీహరికి 3నెలల ముందే తెలుసా.. కారణమేంటంటే..?
Advertisement
అంతే కాకుండా చాలా మంది హీరోయిన్ లు కూడా అలా వచ్చినవాళ్లే. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో ఓ అమ్మాయి చిన్న పాత్రలు చేసి ప్రస్తుతం సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తోంది. అమ్మాయి ఎవరో ఎలా ఎదిగిందో ఇప్పుడు చూద్దాం..నాని హీరోగా నటించిన మజ్ను సినిమాలో అను ఇమాన్యూయేల్ హీరోయిన్ గా నటించింది.
Advertisement
కాగా ఆ సినిమాలో అనుకు స్నేహితురాలిగా నటించిన అమ్మాయి తన నటనతో ఆకట్టుకుంది. ఆ అమ్మాయి పేరు బాంధవి శ్రీధర్. మజ్ను తరవాత మరికొన్ని సినిమాలలో కూడా బాంధవి నటించింది. అయితే ఏ సినిమాలో కూడా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ రీసెంట్ గా వచ్చిన మసూద సినిమాతో బాంధవి శ్రీదర్ కు బ్రేక్ వచ్చింది. మసూద సినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయి పాత్రలో నటించి బయపెట్టిన అమ్మాయి బాంధవినే అన్న విషయం చాలా మందికి తెలియదు. ఇక రీసెంట్ ఇంటర్వ్యూలో తాను మజ్ను సినిమాలో నటించానని బాంధవి చెప్పడంతో నెటిజన్ లు షాక్ అవుతున్నారు.
ALSO READ : కేజీఎఫ్ స్టోరీ నుంచి సుకుమార్ ఆ లైన్ లేపేసాడా..? పుష్ప కోసమే..!