Home » ఫిల్మ్ ఇండ‌స్ట్రీ చెన్నై నుండి హైద‌రాబాద్ ఎలా వ‌చ్చిందో తెలుసా…ఏఎన్ఆర్ ఏం చేశారంటే..?

ఫిల్మ్ ఇండ‌స్ట్రీ చెన్నై నుండి హైద‌రాబాద్ ఎలా వ‌చ్చిందో తెలుసా…ఏఎన్ఆర్ ఏం చేశారంటే..?

by AJAY
Ad

ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు నారాయణ. అంతులేని కథ సినిమాతో నారాయణ టాలీవుడ్ కు పరిచయమయ్యారు. ఆ తర్వాత హీరోగాను కొన్ని సినిమాల్లో నటించారు. నటుడిగా నంది అవార్డుతో పాటూ మ‌రికొన్ని అవార్డుల‌ను సైతం సొంతం చేసుకున్నారు. కేవలం సినిమాల్లో నటించడమే కాకుండా ముగ్గురు మొనగాళ్లు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను ఆయన నిర్మించారు.

Advertisement

ఈ చిత్రంతో పాటు పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇక నారాయణకు అప్పటి హీరోలతో మంచి సంబంధాలు ఉండేవి. కాగా గతంలో ఇంటర్వ్యూలో సినిమా ఇండస్ట్రీ హైదారాబాద్ కు ఎలా వ‌చ్చిందో చెబుతూ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో విజయ సంస్థకు ఎన్టీఆర్ పర్మినెంట్ హీరోగా ఉండేవారిని చెప్పారు. అంతేకాకుండా హైదరాబాద్ కు వచ్చే ముందు అక్కినేని నాగేశ్వరరావు తనకంటూ ఓ నిర్మాణ సంస్థ ఉండాలని భావించారని చెప్పారు.

Advertisement

అందుకే హైదరాబాదులో అన్నపూర్ణ స్టూడియోస్ ను నిర్మించార‌ని తెలిపారు. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తం హైదరాబాదు వస్తే బాగుంటుందని భావించారని తెలిపారు. అంతేకాకుండా తక్కువ ధరలకు రాయితీలు ఇచ్చి స్థలాలను కేటాయించార‌ని చెప్పారు. అక్కడితో ఆగిపోకుండా తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగులు జరిపితే ట్యాక్స్ బెనిఫిట్ లు కూడా ఇచ్చారని చెప్పారు.

హైదరాబాదులో సావిత్రి శోభన్ బాబు లాంటి నటీనటులకు ఇల్లు ఉండేవని అన్నారు. ఇక్కడ సినిమా షూటింగ్లు జరుగుతున్నప్పుడు నటీనటులు శోభ‌న్ బాబు, సావిత్రిల ఇండ్లలో ఉండే వారిని చెప్పారు. అంతేకాకుండా షూటింగ్ పూర్తయిన తర్వాత తిరిగి చెన్నై వెళ్ళిపోయే వారని అన్నారు. ఏఎన్ఆర్ చొరవతో సారథి స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోల‌ను నిర్మించార‌ని చెప్పారు.

Visitors Are Also Reading