Home » నేను ఆరోజు సిల్క్ స్మిత దగ్గరికి వెళ్తే తాను చనిపోయెదు కాదు..!

నేను ఆరోజు సిల్క్ స్మిత దగ్గరికి వెళ్తే తాను చనిపోయెదు కాదు..!

by Azhar
Ad

మన తెలుగు సినిమాల్లో ఇప్పుడంటే అందరూ హీరోయిన్స్ ఐటం సాంగ్స్ లో నటిస్తున్నారు. కానీ ఒక్కపుడు మాత్రం అలా కాదు. కొంత మంది మాత్రమే అలా ఐటం సాంగ్స్ లో అభిమానులను అలరించేవారు. అందులో అనురాధ కూడా ఒక్కరు. టాలీవుడ్ లోకి ఓ నటిగా వచ్చిన అనురాధ… తన నటనతో కంటే ఐటం సాంగ్స్ లో వేసిన స్టెప్స్ వల్లనే ఎక్కువ పేరు సంపాదించారు. అయితే ఇప్పుడు ఆమె సిల్క్ స్మిత గురించి.. ఆమె మరణం గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Advertisement

తాజాగా అనురాధ మాట్లాడుతూ… సిల్క్ స్మితది చాలా చిన్నపిల్ల మనస్తత్వం. ఆమె పాటలో అలా నటించిన బయట మాత్రం చాలా సైలెంట్ గా ఉండేది. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు. దాంతో అందరూ ఆమెకు కొంచెం పొగరు ఎక్కువ అనుకునేవారు కానీ కాదు. సిల్క్ స్మిత నాకు మంచి ఫ్రెండ్. ఠానేహి ఎప్పుడు మాట్లాడిన నేను అది కొన్నాను.. ఇది కొన్నాను అనే చెప్పేది. కానీ తన బాధల గురించి మాత్రం ఒక్కసారి కూడా చెప్పలేదు,

Advertisement

అయితే సిల్క్ స్మిత తాను చనిపోయిన ముందు రోజు రాత్రి నాకు ఫోన్ చేసింది. మీరు ఏం చేస్తున్నారు అంటే మా ఆయన బయట నుండి వస్తున్నారు. ఆయన కోసం ఎదురు చూస్తున్నాను అన్ని చెప్పను. అప్పుడు ఆమె మీరు ఒక్కసారి మా ఇంటికి వస్తారా అని అడిగింది. దానికి నిన్ను ఇప్పుడా… రేపు మా అమ్మాయిని స్కూల్ లో దింపి వస్తాను అని చెప్పగానే… సరే అని ఫోన్ పెట్టేసింది. కానీ నిన్ను పొద్దున లేవగానే టీవీలో సిల్క్ స్మిత మరణ వార్త వచ్చింది. నేను చాలా షాక్ అయ్యాను. కనీసం నేను ఆరోజు రాత్రి తన ఇంటికి వెళ్తే తాను ఇలాంటి పని చేసి ఉండేది కాదు అని నేను అనుకుంటున్నాను అని అనురాధ చెప్పారు.

ఇవి కూడా చదవండి :

SRH అందుకే ఈ సీజన్ లో ఓడిపోయింది.. వారు చేసిన పెద్ద తప్పు ఏంటంటే..?

సెహ్వాగ్ కు అక్తర్ వార్నింగ్.. ఎందుకంటే…?

Visitors Are Also Reading