సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో సీరియల్స్ కు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. అందువల్లే సీరియల్స్ ను సైతం భారీ బడ్జెట్ తో తారాగణంతో తెరకెక్కిస్తుంటారు. ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో ఇతర భాషల నుండి హీరోయిన్స్ ను తీసుకుంటున్నారంటే సీరియల్స్ కు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక సినిమాలు కేవలం మూడు గంటలే వినోదాన్ని పంచితే సీరియల్స్ మాత్రం సంవత్సరాల పాటూ వినోదాన్ని పంచుతాయి. ప్రతి రోజు అరగంట పాటూ వచ్చే ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. అయితే సీరియల్స్ ను సాగదీయడం మాత్రం ప్రేక్షకులకు కాస్త విసుగ్గా అనిపిస్తుంది.
Advertisement
అసలు సీరియల్స్ ను ఎందుకు అంత సాగదీస్తారు అన్నది మాత్రం ఎవరికీ అర్థం కాదు. అయితే తాజాగా సీనియర్ నటి శివపార్వతి సీరియల్స్ ను ఎందుకు అంతలా సాగదీస్తారో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అంతే కాదు సీరియల్స్ ఎన్నో లోపాలు కూడా ఉంటాయని శివ పార్వతి చెప్పుకొచ్చింది. సినిమా రెండు గంటల్లో కథ మొత్తం చెబుతుందని సీరియల్ సంవత్సరాల పాటు సాగదీస్తారని ప్రేక్షకులకు డౌట్ లు వస్తాయని అన్నారు.
Advertisement
అయితే సీరియల్స్ సంవత్సరాల పాటూ ప్రసారం చేయడం ద్వారా ఎంతో మందికి ఉపాది కలుగుతుందని చెప్పారు. అంతే కాకుండా ఇల్లు కట్టుకుంటారు. పెళ్లి చేసుకుంటారు ఇలా ఎన్నో అవసరాలు తీరుతాయని అన్నారు. అయితే తమ అవసరాలను పక్కన పెడితే సీరియల్స్ చూడకుండా ఎవరున్నారని ప్రశ్నించారు. చూడటం మానేస్తే సీరియల్స్ ఆగిపోతాయి కదా అన్నారు.
ALSO READ : Vaseline కారణంగా హీరోయిన్ అయిన ఈమె గురించి మీకు తెలుసా?
చూస్తున్నారు కాబట్టే సీరియల్స్ నడుస్తున్నాయని చెప్పారు. సినిమాల కంటే సీరియల్స్ మేకింగ్ చాలా కష్టమని అన్నారు. సినిమాల షూటింగ్ లో డైరెక్టర్ కు స్వేచ్చ ఉండదని అన్నారు. సీరియల్స్ కోసం అవుట్ పుట్ ఎక్కువ ఉండాలని డైరెక్టర్ కు ప్రొడ్యూసర్ కు చాలా ఒత్తిడి ఉంటుందని చెప్పారు. డైలాగులు ప్రాక్టిస్ చేసుకోవడానికి కూడా సరిగ్గా సమయం ఉండదని అన్నారు.