Home » రాజమౌళి మగధీర 100 మంది ఫైట్ .! అక్కడ నుంచి కాపీ చేసారా ?

రాజమౌళి మగధీర 100 మంది ఫైట్ .! అక్కడ నుంచి కాపీ చేసారా ?

by AJAY
Published: Last Updated on

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కెరీర్ లో అతిపెద్ద హిట్ సినిమా మ‌గ‌ధీర‌. ఈ సినిమాతోనే రామ్ చ‌ర‌ణ్ స్టార్ గా మారారు. అంతే కాకుండా రాజ‌మౌళిని కూడా ఈ సినిమా దేశం మొత్తానికి ప‌రిచ‌యం చేసింది. సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టించ‌గా ఆమె కెరీర్ కూడా మ‌లుపు తిరిగింది. ఓవ‌ర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది. ఈ సినిమాలో చాలా సీన్లు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి.

అలా సినిమాలో చెప్పుకోదగ్గ స‌న్నివేశాల‌లో సినిమా క్లైమాక్స్ లో ఉండే ఫైట్ కూడా ఒక‌టి. ఈ ఫైట్ లో రామ్ చ‌ర‌ణ్ ఏకంగా వంద‌మందిని చంపేస్తాడు. అంతే కాకుండా షేర్ ఖాన్ ఒక్కొక్క‌రిని పంపిస్తే….ఒక్కొక్క‌రిని కాదు ఒకేసారి వంద‌మందిని ర‌మ్మ‌ని చెప్పు అంటూ స‌వాల్ విసురుతాడు. ఆ త‌ర‌వాత వంద‌మంది ఒకేసారి మ‌గ‌ధీరుడిపై దాడి చేస్తారు. అంద‌రినీ మ‌ట్టుపెట్టే ఈ సీన్ గురించి మాటల్లో వివ‌రించ‌లేం.

Magadheera

Magadheera

ఇదిలా ఉంటే ఈ సినిమాకు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ‌ను అందించిన‌ సంగ‌తి తెలిసిందే. కాగా ఈ సీన్ ను విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఓ మ‌రాఠీ సినిమా నుండి కాపీ కొట్టారు. 1987లో చ‌త్రప‌తి శివాజీ జీవిత క‌థ ఆధారంగా మ‌రాఠీ సినిమా ఛ‌త్ర‌ప‌తి శివాజీ సినినిమా చూస్తున్నారు. ఈ సినిమాలో శివాజీ తానాజీ చేసే ఓ ఫైట్ స‌న్నివేశాన్ని చూసి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఇన్స్పైర్ అయ్యారు.

సినిమాలో తానాజీ పాత్ర విజ‌యేంద్ర‌ప్రసాద్ కు ఎంతో న‌చ్చింది. ఇక మ‌గ‌ధీరుడు కూడా వంద‌మందిపై విరోచితంగా పోరాడి విజ‌యం సాధించాల‌ని విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ అనుకున్నారు. అలానే రాశారు కూడా….ఇక ఈ సినిమాకు ఫైట్ మాస్ట‌ర్ గా పీట‌ర్ హెయిన్ చేసిన సంగ‌తి తెలిసిందే. సినిమా కోసం పీట‌ర్ హెయిన్ కూడా చాలా క‌ష్ట‌పడ్డారు. ఎన్నో రిస్కీ ఫైట్ ల‌ను చేశాడు.

Visitors Are Also Reading