టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ లుగా రాణించిన వారిలో జయసుధ కూడా ఒకరు. జయసుధ అప్పటి స్టార్ హీరోలు అందరికీ జోడీగా నటించింది. తన నటనతో జయసుధ సహజనటి అనే బిరుదును సంపాదించుకుంది. హీరోయిన్ గా గుడ్ బై చెప్పిన తరవాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందల చిత్రాలలో నటించింది. సినిమాలలో తల్లి, అక్క, అమ్మమ్మ లాంటి పాత్రలలో నటించి అభిమానులను సంపాదించుకుంది. స్టార్ హీరోయన్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన జయసుధ సినిమా జీవితం గురించి చాలా మందికి తెలుసు కానీ జయసుధ పర్సనల్ లైఫ్ గురించి మాత్రం అతికొద్ది మందికి మాత్రమే తెలుసు.
Advertisement
జయసుధ అసలు పేరు సుజాత కాగా చిన్నవయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో కాకర్లపూడి రాజేంద్రప్రసాద్ ను పెళ్లి చేసుకుంది. ఓ సినిమా షూటింగ్ సమయంలో రాజేంద్రప్రాసాద్ తో జయసుధకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కొన్నాళ్లకు ప్రేమగా మారింది. జయసుధ రాజేంద్రప్రసాద్ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ జయసుధ తల్లిదండ్రులు ఆ పెళ్లికి ఒప్పుకోలేదు.
Advertisement
దాంతో జయసుధ రాజేంద్రప్రసాద్ ఓ గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తరవాత జయసుధ తల్లితండ్రులు ఏమీ చేయలేక ఇద్దరికీ విజయవాడలో బంధువులు స్నేహితుల మధ్యలో మరోసారి పెళ్లి జరిపించారు. రాజేంద్రప్రసాద్ ఓ వ్యాపారవేత్త కాగా జయసుధ హీరోయిన్ దాంతో ఇద్దరి మధ్య దూరం ఏర్పడిందట. అంతే కాకుండా రాజేంద్రప్రసాద్ జయసుధను టార్చర్ చేయడం మొదలుపెట్టారట.
ఆ టార్చర్ భరించలేక చెన్నైలోని విజయవాహిని స్టూడియోలో తలదాచుకున్నారట. గొడవల గురించి స్టూడియో అధినేత నాగిరెడ్డికి జయసుధ వివరించారట. దాంతో సినీప్రముఖులు రాజేంద్రప్రసాద్ ను పిలిపించి పంచాయితీ పెట్టారట. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో చివరికి జయసుధ ఆయనతో విడాకులు తీసుకున్నారు. ఆ తరవాత జయసుధ నిర్మాత నితిన్ కపూర్ ను ప్రేమించి వివాహం చేసుకున్నారు.