కోలీవుడ్ లవ్లీ కపుల్ దనుష్ ఐశ్వర్య విడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోవడం అభిమానులను షాక్ కు గురి చేసింది. అయితే వీరిద్దరి విడాకులకు కొన్ని కారణాలు ఉన్నాయంటూ కోలీవుడ్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. పద్దెనిమిదేళ్ల వైవాహిక జీవితంలో కొన్ని మనస్పర్ధలు కూడా వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి కొన్నేళ్ల క్రితం జరిగిన సుచి లీక్స్ ఉదంతంలో ధనుష్ ఫోటోలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఆ సమయంలో ధనుష్ ఐశ్వర్య మధ్య మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో రజనీకాంత్ రంగంలోకి దిగి మళ్ళీ ఇద్దరిని కలిపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈసారి మాత్రం దనుష్ విడాకులకు కారణం అని తెలుస్తోంది. ప్రస్తుతం దనుష్ ఓ హీరోయిన్ తో ఎక్కువ క్లోజ్ గా ఉంటున్నారట. అది ఐశ్వర్యకి నచ్చలేదని అందువల్ల గత కొంతకాలంగా ఐశ్వర్య ధనుష్ దూరంగా ఉంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు రజనీకాంత్ హీరోగా నటించిన కాలా సినిమాను దనుష్ నిర్మించారు.
Advertisement
Advertisement
ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. అయితే ఈ సినిమా సమయంలో రజినీకాంత్ ఆర్థికంగా ఆదుకోలేదని దనుష్ అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఐశ్వర్య ఒక పాన్ ఇండియా సినిమాను నిర్మించాలని ప్రయత్నించింది. కానీ దనుష్ ఒప్పుకోలేదని దాంతో ఇద్దరి మధ్య ఈగో నెలకొందని కూడా తెలుస్తోంది. ఇక ఇద్దరూ విడాకులు ప్రకటించడానికి ముందు రజినీకాంత్ కు ఫోన్ కూడా చేశారట. దాంతో రజనీకాంత్ ఆ నిర్ణయాన్ని వారిద్దరికే వదిలేసినట్టు సమాచారం. అలా మొత్తానికి ఓ అందమైన జంట విడిపోయారట. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఎవరో ఒకరు స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే.