చాణక్యుడి నీతిని ఆయన రచించిన గ్రంథాలను చాలామంది పాటిస్తూ ఉంటారు. చరిత్రలో ఎంతోమంది జ్ఞానులు ఉన్నా ఇప్పటి జనరేషన్ కూడా చాణక్యుడి నీతిని ఫాలో అవుతుంది అంటే ఆయన ఎంత ప్రభావవంతంగా నీతి సూత్రాలను బోధించారో అర్థం చేసుకోవచ్చు. ఇక చాణక్యుడి జీవితం కూడా ఎంతో ఆసక్తికరంగా సాగింది. చాణక్యుడి అసలు పేరు విష్ణు గుప్తుడు మరియు కౌటిల్యుడు. ఆయన రచించిన నీతిశాస్త్రం ప్రజలకు జీవిత విధానాలను నేర్పిస్తుంది. అయితే చాణక్యుడు పుట్టిన సమయంలో అతడికి నోటిలో ఒక పన్ను ఎక్కువగా ఉండేది.
Advertisement
ఆ పన్ను చూసి ఒక జైన సన్యాసి ఆశ్చర్యపోయాడు. పిల్లవాడు రాజు అవుతాడని తల్లిదండ్రులకు చెప్పాడు. దాంతో చాణక్యుడి తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. ఆ పన్ను తొలగిస్తే ఎలాంటి సమస్య ఉండదని జైన సన్యాసి తల్లిదండ్రులకు పరిష్కారంగా చెబుతాడు. దాంతో చాణక్యుడి తల్లిదండ్రులు జైన సన్యాసి చెప్పినట్టుగా చేస్తారు. ఇక ఎంతో మేధస్సు కలిగిన చాణక్యుడు ఆర్థికశాస్త్రం, రాజకీయాలు, దౌత్యం లాంటి విషయాలపై ఎంతో పట్టు సాధిస్తాడు. చాణక్యుడి తండ్రి మరణానంతరం అతడి సామర్థ్యాలను రాధా మోహన్ అనే పండితుడు పసిగడతాడు. తక్షశిల విశ్వవిద్యాలయంలో చాణక్యుడిని చేర్పిస్తాడు. అక్కడ నుండి చాణక్యుడి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత చాణక్యుడు అధ్యాపకుడిగా పలు విశ్వవిద్యాలయాల్లో బోధించాడు. అనేక గ్రంధాలను రచించాడు. చాణక్యుడు శత్రువులను ప్రజలను బాగా అర్థం చేసుకోవడంలో దిట్ట.
Advertisement
Also read :డిసెంబర్ 31 నైట్ స్విగ్గీ, జోమాటో ల బిజినెస్ ఏ రేంజ్ లో జరిగిందో తెలుసా?
ఈ నేపథ్యంలోనే చాణక్యుడు తమ రాజు అయిన చంద్రగుప్తుడు తినే ఆహారంలో ప్రతిరోజూ తక్కువ మోతాదులో విషయాన్ని ఇచ్చేవాడు అని చెబుతూ ఉంటారు. భవిష్యత్తులో చంద్రగుప్తుడి పైకి శత్రువులు విషపు దాడి చేసినా కూడా అతడు భరించగలిగే శక్తి వస్తుందని అలా చేసేవాడని చెబుతారు. ఇక చాణక్యుడి మరణంపై కూడా ఎన్నో కథలు వినిపిస్తాయి. చాణక్యుడు ఒకరోజు విధులను పూర్తిచేసుకుని రథంపై అడవిలోకి వెళ్లారని మళ్ళీ తిరిగి రాలేదని కొంతమంది చెబుతారు. మరి కొంతమంది హెలెనా అనే రాణి చాణక్యుడి కి విషం పెట్టి చంపిందని కూడా చెబుతుంటారు. ఇక ఇప్పటికీ ఆయన మరణం మిస్టరీ గానే మిగిలిపోయింది.
Also read : చైతూ బాటలో మరో స్టార్..భార్యతో విడాకులు…!