World Cup 2023 : పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్… బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆమెను పెళ్లి చేసుకుంటా అంటూ పిచ్చి కూతలు కుశాడు అబ్దుల్ రజాక్. అసలు వివరాల్లోకి వెళితే, ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంటులో అంచనాలు ఉన్న జట్లు దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన జట్లు మాత్రం గ్రాండ్ విక్టరీ కొట్టాయి. అలా ఆఫ్గనిస్తాన్ మరియు నెదర్లాండ్ జట్లు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అయితే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంటులో పాకిస్తాన్ జట్టు ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఆడిన తొమ్మిది మ్యాచ్లలో కేవలం రెండు మ్యాచ్లో గెలిచింది పాకిస్తాన్. దీంతో గోరా పరాజయాన్ని చవిచూసి… ఇంటి దారి పట్టింది పాకిస్తాన్ జట్టు. అయితే వరల్డ్ కప్ విఫలమైన పాకిస్తాన్ జట్టు పై విమర్శలు తీవ్రస్థాయిలో వస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ను ఆ పదవి నుంచి తొలగించాలనే డిమాండ్ వినిపిస్తోంది.
Advertisement
Advertisement
ఇది ఇలా ఉండగా… ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 లో విఫలమైన పాక్ టీం ను విమర్శిస్తూ మాజీ క్రికెటర్ రజాక్… ఐశ్వర్యారాయ్ ప్రస్తావన తీసుకొచ్చారు. ‘మనం ఆటగాళ్ల ప్రదర్శనపై మాట్లాడుతున్నాం. కానీ వారిని ముందుగానే సిద్ధం చేయాలని ఉద్దేశం ఎవరిలోనూ కనిపించలేదు. ఐశ్వర్యరాయ్ ను పెళ్లి చేసుకొని, పిల్లలను కనోచ్చని మీరు అనుకుంటే జరగదు. అందుకే సరైన ఉద్దేశాలు ఉండాలి’ అని పేర్కొన్నారు. పెళ్లైన మహిళ గురించి మాట్లాడటం సిగ్గుచేటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.