Home » Aadikeshava Review : ‘ఆదికేశవ’ రివ్యూ.. మెగా ఫ్యామిలీ ఖాతాలో మరో డిజాస్టరేనా ?

Aadikeshava Review : ‘ఆదికేశవ’ రివ్యూ.. మెగా ఫ్యామిలీ ఖాతాలో మరో డిజాస్టరేనా ?

by Bunty
Ad

Aadikeshava Review : వైష్ణవ్ తేజ్ గురించి తెలియని వారు ఉండరు. ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్. తొలి చిత్రంతోనే బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నాడు. కానీ ఈ మూవీ తర్వాత ఆ రేంజ్ లో మరో హిట్ పడలేదు. ఇక తాజాగా వైష్ణవ తేజ్ చేసిన సినిమా ఆదికేశవ. ఇందులో శ్రీలీల కథానాయికగా నటించగా….. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ మూవీపై మరింత క్యూరియాసిటీని కలిగించగా…… పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను నవంబర్ 24న అంటే ఈరోజు థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేసింది చిత్ర యూనిట్. మరి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

aadikeshava-review

aadikeshava-review

కథ మరియు వివరణ :

Advertisement

వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా చేసిన ఆది కేశవ సినిమా కథ విషయానికి వస్తే…. బాలకోటయ్య అలియాస్ బాలు (వైష్ణవ్ తేజ్) ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన అబ్బాయి. అతని కళ్ళ ముందు అన్యాయం జరిగితే తట్టుకోలేడు. ప్రత్యర్థి ఎంత బలమైనోడు అయినా, పలుకుబడి ఉన్నోడు అయినా ఎదురెళ్లి పోరాడతాడు. అలాంటి బాలు తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు ఓ కార్పొరేట్ కంపెనీలో మార్కెటింగ్ హెడ్ గా జాబ్ సంపాదిస్తాడు. చిత్ర (శ్రీలీల) బాలు తెలివితేటలను మెచ్చుకొని ఆమెకు ఆ జాబ్ ఇస్తుంది. కొంత టైం లోనే ప్రేమలో పడతారు. కానీ చిత్ర తండ్రికి అది నచ్చదు.

Advertisement

ఆమె బర్త్డే పార్టీలో వేరే అబ్బాయితో పెళ్లి చేయబోతున్నట్టు అనౌన్స్ చేస్తాడు. ఆ తర్వాత చిత్ర తండ్రి బాలుకు వార్నింగ్ ఇచ్చే టైం కి…. రాయలసీమకు చెందిన ఎమ్మెల్యే మహా కాలేశ్వర్ రెడ్డి (సుమన్) అన్నయ్య (తనికెళ్ళ భరణి) వచ్చి బాలు గురించి ఊహించని ట్విస్ట్ ఇస్తాడు. బాలు అసలు పేరు రుద్ర కాళేశ్వరరెడ్డి అని…. ఎమ్మెల్యే మహా కాలేశ్వర్ రెడ్డి (సుమన్) కొడుకు అని చెబుతాడు. ఆ తర్వాత బాలుని సీమకి తీసుకువెళ్తే అక్కడ చెంగారెడ్డి (జోజు జార్జ్) వల్ల అతనికి అనేక సమస్యలు వస్తాయి. మరి ఆ సమస్యలు ఎలా తొలగిపోతాయి….. ఈ సినిమాలో ఉన్న ట్విస్ట్ ల గురించి తెలియాలంటే థియేటర్ లో సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

  • వైష్ణవ్ తేజ్
    హీరోయిన్ శ్రీ లీల
    మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

  • కథ
    సాగదీత
    రొటీన్ లవ్ స్టోరీ
    కామెడీ మిస్సింగ్

రేటింగ్ : 2. 75/5

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading