Home » ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే మూవీకి అప్పట్లో ఓ రికార్డ్.. ఎన్ని కోట్ల లాభాలంటే..?

ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే మూవీకి అప్పట్లో ఓ రికార్డ్.. ఎన్ని కోట్ల లాభాలంటే..?

by Sravanthi
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో వెంకటేష్ అంటే వివాద రహితుడిగా చెప్పవచ్చు. ఎంతో హుందాగా వ్యవహరించే ఈయన కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే. తమిళ డైరెక్టర్ సెల్వ రాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎలాంటి ఉద్యోగం లేకుండా ఖాళీగా తిరుగుతూ తండ్రి పై ఆధారపడి ఉన్న వ్యక్తిని ఒక అమ్మాయి పరిచయమైతే జరిగే మార్పులు ఎలా ఉంటాయో ఈ కథలో చూపించాడు రాఘవన్. ఈ సినిమా రామానాయుడు స్టూడియోలో చిరంజీవి క్లాప్ కొట్టి ప్రారంభించారు. అయితే ఈ చిత్రానికి ముందుగా హీరోయిన్ ఆర్తి అగర్వాల్ అనుకున్నారు.

Advertisement

Also Read;“లవ్ యు రాజా” అనే పదం పోసానికి ఎందుకు మేనరిజంగా మారింది?

కానీ ఆమెకి అప్పటికే పెళ్లి ఫిక్స్ కావడంతో హీరోయిన్ గా చేయడం లేదని చెప్పేసింది. ఆ తర్వాత జ్యోతికను తీసుకున్నారు. ఇక షూటింగ్ రెగ్యులర్ గా చేయాలని అనుకునే సమయంలో జ్యోతికకు సూర్యాతో పెళ్లి ఫిక్స్ అయింది. దీంతో చివరికి త్రిషను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. ఈ క్రమంలోనే వెంకి తులసి మూవీ కి కూడా కమిట్మెంట్ అయ్యారు. సెప్టెంబర్ నుండి షూటింగ్ శరవేగంగా సాగింది. రామోజీ ఫిలిం సిటీ మరియు రామానాయుడు స్టూడియో, న్యూజిలాండ్ లో సాంగ్స్ షూట్ చేశారు. అంతేకాకుండా కొన్ని విలేజ్ సీన్స్ అన్ని రాజమండ్రిలో తీశారు. ఈ విధంగా షూటింగ్ కంప్లీట్ చేస్తారు. మార్చి 28వ తేదీన ఆడియో రిలీజ్ అయింది. ఇందులో ఉండే ప్రతి సాంగ్ సూపర్ హిట్. 2007 ఏప్రిల్ 27న 267 థియేటర్స్ లో మాత్రమే మూవీ రిలీజ్ అయింది.

Advertisement

కామెడీ ఎమోషన్స్ సీన్స్ తో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది. తన తండ్రి కోట శ్రీనివాసరావు మీద ఆధారపడి జీవిస్తూ చివరకు తండ్రి పోయాక ఆయన కన్న కలలు తెలుసుకొని బైక్ నడిపించి చూసే ప్రతి ప్రేక్షకుడు కంటతడి పెట్టుకున్నాడు.ఇక సెకండ్ హాఫ్ లో లవ్ ఎమోషన్ కామెడీ సన్నివేశాలు మరో లెవెల్. ఈ సినిమాకు గాను వెంకటేష్ కు ఉత్తమ నటుడిగా నంది అవార్డు కూడా దక్కింది. బెస్ట్ ఫిలిం అవార్డు కూడా గెలుచుకుంది. త్రిష కు ఫిలింఫేర్ అవార్డు. మొత్తానికి చిత్రం 21 సెంటర్లలో వంద రోజులు ఆడి కేవలం విజయవాడ సిటీ లో 65 లక్షల కలెక్ట్ చేసి టాప్ గ్రాస్ గా నిలిచింది. మొత్తానికి 20 కోట్లు కలెక్ట్ చేసి 2007లో టాప్ సిక్స్ సినిమాల్లో ఒకటిగా నిలిచిందని చెప్పవచ్చు. అప్పట్లో ఈ సినిమా వెంకటేష్ కెరీర్ ను మరో లెవల్ కు తీసుకెళ్లింది.

Also Read;వచ్చే ఎన్నికల్లో పోటీ.. ఎన్టీఆర్ ప్రచారానికి.. తారకరత్న సంచలనం!

Visitors Are Also Reading