ప్రపంచంలో వివిధ రకాల పాములు కనిపిస్తాయి. వాటిలో కొన్ని పాముల గురించి మనకు తెలుసు. కొన్నిటి గురించి తెలియదు. అయితే పాములు సాధారణంగా విషపూరితమైనవి. ప్రమాదకరమైనవిగా పరిగణించబడతాయి. అయితే అన్ని పాములు విషపూరితమైనవి కావు. నల్లతాచు, కట్లపాము వంటివి మొదలైన పాములు విషపూరితమైనవి. వీటిని అత్యంత ప్రమాదకరమైన విషపూరిత పాముగా పరిగణిస్తారు.
Advertisement
ఇందులో హానిచేయని పాములు, రెండు తలల పాములు. అయితే, ఈ రెండు తలల అరుదైన పాము ఒకటి బీహార్ లోని బెగుసరాయ్ జిల్లాలో ఉన్న ఓ గ్రామస్తులకు ఇటీవల దొరికింది. అయితే బహిరంగ మార్కెట్లో ఈ పాము విలువ రూ.25 కోట్లు ఉంటుందని, చైనా వంటి దేశాల్లో ఈ పాము మాంసాన్ని ఔషధాలు, హోటల్ డిష్ లలో వాడతారని తెలుసుకున్న కొందరు, తక్కువ ధరకు ఈ సర్పాన్ని కొందామని గ్రామస్తులతో బేరం ఆడారు.
Advertisement
ఈ విషయం తెలుసుకున్న ముఖేష్ పాశ్వాన్ అనే జంతు ప్రేమికుడు ఆ అరుదైన, అంతరించే దశలో ఉన్న ఈ సర్పాన్ని ఎలాగైనా రక్షించాలి అనుకున్నాడు. వెంటనే ఈ విషయాన్ని జిల్లాలోని ఒక కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పాములు వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని అధికారులను కోర్టు ఆదేశించింది. అధికారులు అలాగే చేశారు. అనంతరం పామును సంరక్షణ కేంద్రానికి తరలించాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టుకు ఓ కంటైనర్ లో పామును తీసుకొచ్చిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
read also : తారకత్న భార్య అలేఖ్య రెడ్డికి చంద్రబాబు కీలక పదవి?