Home » రన్ బీర్ అలియాకు ఇవ్వబోయే స్పెషల్ గిఫ్ట్.. చరిత్ర మీకు తెలుసా..!!

రన్ బీర్ అలియాకు ఇవ్వబోయే స్పెషల్ గిఫ్ట్.. చరిత్ర మీకు తెలుసా..!!

by Sravanthi
Ad

ఎంతో కాలంగా ప్రేమలో ఉండి పెళ్ళితో ఒకటవబోతున్న రన్ బీర్ -ఆలియా పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముంబైలో రన్బీర్ సొంత ఇంట్లో ఈ తంతు నడుస్తోంది. ఈ క్రమంలో వారి సంప్రదాయం ప్రకారం అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రన్ బీర్ తన కాబోయే భార్య కోసం స్పెషల్ బహుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీని పేరే వెడ్డింగ్ బ్యాండ్. దీన్ని తన భార్య కోసం స్పెషల్ గా తయారు చేయించినట్లు తెలుస్తోంది.

Advertisement

Advertisement

 

ఎనిమిది వజ్రాలతో పొదిగిన ఖరీదైనటువంటి వెడ్డింగ్ బ్యాండ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. పెళ్లిలో ఆలియా ఈ బ్యాండ్ ధరించనుందని సమాచారం. అయితే ఈ ఎనిమిది వజ్రాలు వెనుక పెద్ద హిస్టరీ ఉందట. ఎనిమిది వజ్రాలకు ఒక ప్రత్యేకమైన అనుబంధం రన్బీర్ కుటుంబంతో ఉందని సన్నిహితులు తెలియజేస్తున్నారు. ఇది రన్ బీర్ కుటుంబ సభ్యుల యొక్క లక్కీనంబర్ గా భావిస్తారని, తాతల కాలం నుండి ఈ యొక్క సంప్రదాయం కొనసాగుతుందని తెలియజేశారు.

అందుకే ఈ ఎనిమిది వజ్రాలు పొదిగిన బ్యాండ్ ను రన్ బీర్ ఆలియా కు బహుకరించానున్నారని తెలుస్తోంది. అయితే ఈ జోడికి పెళ్లి కానుకగా మొదటిసారి కలిసి నటించిన “బ్రహ్మాస్త్ర” నుంచి “కేసరియా” అనే రొమాంటిక్ సాంగ్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక వివాహ వేడుకల్లో భాగంగా వారు కొన్ని రకాల పూజలు చేసినట్టు తెలుస్తోంది.

Visitors Are Also Reading