జయలలిత తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్లలో అత్యంత గుర్తింపు సాధించిన నటి. అలాంటి జయలలిత సినిమాల్లో నటించడమే కాదు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ముఖ్యమంత్రిగా కూడా చేసింది. అంతటి పేరు సంపాదించుకున్న జయలలిత మహానటి సావిత్రి కంటే ఎక్కువగా పేరు సంపాదించుకుంది. ముఖ్యంగా తమిళనాడులో ఆమెను అమ్మ అమ్మ అంటూ పిలుస్తారు. ఆమె పెట్టిన క్యాంటీన్ల ద్వారా ఇప్పటికీ వేలాది మందికి పేదలకు ఉచితంగా భోజనాన్ని అందిస్తున్నారు. ఇంతటి గొప్ప దానకర్ణురాలు.
Advertisement
also read:మనిషి నవ్వడం వెనుక ఉన్న శాస్త్రీయ కారణం మీకు తెలుసా..?
అయితే అలాంటి జయలలితకు మరియు ఇండస్ట్రీలో ఉండే మరో వాంప్ పాత్రలు చేసే జయలలితకు మధ్య చిన్న గొడవ జరిగిందట.. అదేంటో ఇప్పుడు చూద్దాం..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు పొందిన జయలలిత వంశీ సినిమాల్లో కనిపిస్తుంది. హీరోయిన్ అవ్వాలనుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె వాంప్ ఆర్టిస్టు గానే మిగిలిపోయింది. కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా తమిళంలో కూడా అనేక పాత్రలు చేస్తూ ఎక్స్పోజింగ్ ఎక్కువగా చేయడంతో తలైవి హీరోయిన్ జయలలితకు శాపంగా మారిందని చెప్పవచ్చు. ఈమె ఎక్స్పోజింగ్ పాత్రలు చేయడంతో ఈమెను అడ్డు పెట్టుకొని సీఎం స్థానంలో ఉన్న జయలలితపై విమర్శలు చేసేవారు ప్రతిపక్ష నాయకులు. ఒకవేళ జయలలితను తిట్టాలనుకుంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసే జయలలిత పేరును వాడుకునేవారు.
Advertisement
దీంతో తన పేరును మార్పు చేసుకోవాలని సలహా ఇచ్చింది సీఎం జయలలిత. అందుకు ఈమె ఒప్పుకోకపోవడంతో డీఎంకే నాయకుల నుంచి బెదిరింపులు కూడా వచ్చాయట. ఈమె ఇంటి ముందు కూర్చొని గొడవకు కూడా దిగారట. మా అమ్మకు ఎదురు చెప్తావా అంటూ ఆమె ఇంటి ముందు బైఠాయించి నినాదాలు కూడా చేశారని ఎవరు ఎన్ని చెప్పినా తాను మార్చుకోవడానికి సిద్ధంగా లేనని క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలలిత అన్నారట. ఈ విధంగా ఇద్దరు జయలలితల పేర్లు ఒకటి కావడం వల్ల తమిళనాడులో పెద్ద గొడవే జరిగింది అని చెప్పవచ్చు.
also read: