ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందరికీ సుపరిచితమే. ఆయన చిన్న కొడుకు శ్రీ సింహ కోడూరి పెళ్లి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ సినీ నటుడు, వ్యాపారవేత్త మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ మనవరాలు రాగ మాగంటిని కీరవాణి కొడుకు సింహ కోడూరికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారని వార్త జోరుగా ప్రచారం అవుతోంది. శ్రీ సింహా నటన వైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. చిన్నాన్న ఎస్ఎస్ రాజమౌళి సినిమాలో బాల నటుడిగా శ్రీ సింహ నటించారు.
Advertisement
Advertisement
మత్తు వదలరా, తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, భాగ్ సాలే, వస్తాద్ వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించారు. అయితే సరైన హిట్ ఇంకా పడలేదు. రాగ మాగంటి యువ వ్యాపారవేత్త. మురళీమోహన్ కి ఇద్దరూ పిల్లలు ఉన్నారు. కొడుకు రామ్మోహన్. రామ్మోహన్, రూపా దంపతుల కూతురు రాగ మాగంటి తాతయ్య నిర్మించిన వ్యాపార సామ్రాజ్యంలో కొన్ని బాధ్యతలు నిర్వహిస్తోంది. రాగని శ్రీ సింహ పెళ్లి చేసుకుంటే కెరీర్ కి తిరుగు ఉండదని అంతా అంటున్నారు మరి వీళ్ళు ఇద్దరిదీ ప్రేమ వివాహమా లేదంటే పెద్దలే అనుకున్నారా అనే విషయం తెలియదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!