Home » పిల్లలు పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఉండాలంటే.. వీటిని కచ్చితంగా నేర్పండి..!

పిల్లలు పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఉండాలంటే.. వీటిని కచ్చితంగా నేర్పండి..!

by Sravya
Ad

ప్రతి ఒక్కరు కూడా మంచిగా పిల్లల్ని తీర్చిదిద్దాలని, పిల్లలు బాగా ఉండాలని అనుకుంటారు. పిల్లల పాజిటివ్ యాటిట్యూడ్ తో ఎదగాలంటే, వీటిని కచ్చితంగా పిల్లలకి నేర్పించండి అప్పుడు మీ పిల్లలు చాలా అద్భుతంగా తయారవుతారు. పిల్లల్ని తీర్చి దిద్దడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సానుకూల దృక్పథంతో పిల్లలు ఉండాలి. అప్పుడే వాళ్ళు భవిష్యత్తులో వచ్చే సవాళ్లు అని ఈజీగా స్వీకరించగలుగుతారు. పిల్లల్లో సాధారణంగా భయాలు నెగటివ్ ఆలోచనలు ఉంటుంటాయి. వాటిని మనం పూర్తిగా తప్పు పట్టక్కర్లేదు. నెగటివ్ ఆలోచనలు తట్టుకుని వాళ్ళు మానసికంగా దృఢంగా మారతారు.

Advertisement

Advertisement

ఎదుటి వాళ్లతో మంచిగా మాట్లాడటం నేర్పాలి అలానే ఫ్రెండ్షిప్ ని పెంచుకునేలా చేయాలి. పిల్లల్ని ధైర్యంగా ఉండమని మనం నేర్పించాలి. ఎప్పుడైనా ఫ్రెండ్స్ తిట్టారని, కొట్టారని చెప్తే వాళ్ళని మళ్లీ మీరు కూడా అలానే చేయమని ప్రోత్సహించకండి. వచ్చిన సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి అనేది చూసుకోవాలి. పిల్లలు ఫ్రెండ్షిప్ ని పెంచుకునే విధంగా మీరు చూడాలి. ఎదుటి వాళ్ళకి సహాయం చేయడం నేర్పించాలి. పిల్లలు ఎప్పుడూ కూడా పాజిటివ్ గా ఉండడానికి మీరు చూడాలి. కౌగిలించుకోవడం, ముద్దు ఇవ్వడం ఇలాంటివి చేయండి. ఎప్పుడూ కూడా పిల్లల్ని ఇంకొకరితో కంపేర్ చేయకండి. పిల్లల్ని ప్రోత్సహించాలి. అలానే పిల్లల్ని మంచి మార్గంలో పెట్టాలి. అంతే కానీ వాళ్లలో భయాలని ఇంకా పెంచకూడదు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading