ఆదివారం ధర్మసల వేదికగా భారత్ – న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. వరుస విజయాలతో జోరుమీద ఉన్న ఇరుజట్లకు ఈ మ్యాచ్ గెలవడం చాలా అవసరం. పైగా 2019 ప్రపంచకప్ సెమీ ఫైనల్ లో ఎదురైన పరాజయానికి పతికారం తీర్చుకోవాలని టీమ్ ఇండియా ఎదురుచూస్తుంది. గత ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్ పై ఓడి ప్రపంచకప్ ను చేజార్చుకున్న కివీస్ ఈ ఏడాది తొలిపోరులో ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది. దీంతో ఇరు జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగేలా కనిపిస్తోంది. ఈ సమయంలో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. బంగ్లాదేశ్తో జరిగిన మ్యా చ్లో హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు.
Advertisement
Advertisement
బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే క్రమంలో పాండ్యా కాలు స్లిప్ అవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆదివారం జరిగే కీలక మ్యాచ్ కు దూరమయ్యాడు. పాండ్యా దూరం కావడంతో తుదిజట్టు ఎంపిక కెప్టెన్ రోహిత్ శర్మకు సవాలుగా మారింది. హార్దిక్ ను భర్తీ చేసే పేస్ ఆల్ రౌండర్ జట్టులో లేకపోవడంతో రోహిత్ టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వరుస విజయాలతో జోరు మీద ఉన్న న్యూజిలాండ్ ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. కివీస్ బౌలింగ్, బ్యాటింగ్ విభాగం బలంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో టీమిండియాకు ఎక్స్ ట్రా బ్యాటర్ తో పాటు స్పెషలిస్ట్ పేసర్ అవసరం.
ఈ నేపథ్యంలో రోహిత్ ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ప్రపంచకప్ లో శార్దూల్ ఠాకూర్ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. అతని స్థానంలో మహమ్మద్ షమీని బరిలోకి దించనున్నాడు రోహిత్. పాండ్యా ప్లేస్ లో సూర్యకుమార్ యాదవ్ తో భర్తీ చేయనున్నాడు రోహిత్. ఇక ధర్మశాల పిచ్ పేస్ కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో అశ్విన్ కూడా డగౌట్ కే పరిమితం కానున్నాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పేసర్లుగా బూమ్రా, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీలు బరిలోకి దిగనున్నారని….స్పిన్ బాధ్యతలు కుల్దీప్ తో పాటు జడేజా పంచుకోనున్నాడు.