Home » ఒకే జెండర్ వాళ్లు పెళ్లి చేసుకుంటే తప్పేంటి – మంచు లక్ష్మి

ఒకే జెండర్ వాళ్లు పెళ్లి చేసుకుంటే తప్పేంటి – మంచు లక్ష్మి

by Bunty
Ad

 

స్వ***లింగ స****పర్కుల వివాహానికి చట్టబద్ధత కల్పించాలంటూ కొన్ని రోజుల నుంచి దేశవ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తోంది. కొంతమంది అయితే ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్వ***లింగ స****పర్కుల వివాహాన్ని చట్టబద్ధంగా గుర్తించాలంటూ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇక రీసెంట్ గా ఈ కేసుపై విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. స్వ***లింగ స****పర్కుల వివాహానికి చట్టబద్ధత కల్పించేందుకు నిరాకరించింది. అయితే వారికి వివాహం కాకుండా సహజీవనం చేసుకునే హక్కు ఉందని తెలియజేసింది. స్వ***లింగ స****పర్కుల  జంటపై ఎలాంటి వివక్ష చూపించకూడదని సుప్రీంకోర్టు తెలియజేసింది.

Lakshmi Manchu’s Reaction On Marriage Verdict

వారి హక్కులను పరిరక్షించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక తాజాగా సుప్రీంకోర్టు నిర్ణయంపై నటి మంచు లక్ష్మి స్పందించారు. ఈ తీర్పుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది మంచు లక్ష్మి. ఈ తీర్పు తనకి తీవ్ర నిరాశను మిగిల్చిందని పేర్కొంది. స్వ***లింగ స****పర్కుల వివాహానికి సుప్రీంకోర్టు చట్టబద్ధత కల్పించలేమని చెప్పడం నాకు తీవ్ర నిరాశను కలిగించింది. ఈ విషయం విన్న తర్వాత నా గుండె పగిలినట్టుగా అనిపించింది. అన్ని రకాల ప్రేమలను స్వీకరించి…. మిగతా ప్రపంచానికి ప్రేమ గురించి బోధించిన దేశానికి నిజంగా ఇది అవమానం అంటూ చెప్పుకొచ్చింది నటి మంచు లక్ష్మి.

Advertisement

Advertisement

ఇతర దేశాల్లో ఎవరికి వారు స్వేచ్ఛగా వారి జీవితాలను కొనసాగిస్తున్నారు. మన దేశంలో సేమ్ జెండర్ పెళ్లిళ్లను స్వీకరించలేమా అని లక్ష్మి ప్రశ్నించారు. అయితే.. మంచు లక్ష్మీ ట్వీట్‌ పెట్టగానే ఆమెను ట్రోలింగ్‌ చేస్తున్నారు. మంచు లక్ష్మీ కూడా ఒకే జెండర్‌ వారితో సహజీవనం చేస్తుందంటూ ఫైర్‌ అవుతున్నారు నెటిజన్స్‌. కాగా…. సుప్రీంకోర్టు తాజా తీర్పుపై మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ తీర్పుపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు అయితే మరీ ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పుని తప్పు పడుతున్నారు.

ఇవి కూడా చదవండి

 

Visitors Are Also Reading