హీరో సూర్య మంచి గుర్తింపుని తెచ్చుకుని, పెద్ద స్టార్ హీరోగా మారారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్స్ గా గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో సూర్య, జ్యోతిక జంట కూడా ఒకటి. సూర్య జ్యోతిక లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. చాలామంది జంటలకి ఆదర్శంగా నిలిచారు జ్యోతిక సూర్య. ఎప్పుడూ కూడా సూర్యని జ్యోతిక ఎందుకు పెళ్లి చేసుకున్నారన్న వార్త బయటకి రాలేదు. తాజాగా ఈమె పుట్టినరోజు సందర్భంగా కొన్ని విషయాలని పంచుకున్నారు.
Advertisement
Advertisement
పెళ్లి మొత్తం నెల రోజుల్లోగా జరిగిపోయిందని సూర్య నాకు ఇచ్చిన గౌరవానికి నేను అతనిని ఇష్టపడ్డానని జ్యోతిక చెప్పింది. ఆ లక్షణమే నన్ను పెళ్లి చేసుకోవాలనేలా తీసుకువచ్చిందని జ్యోతిక సూర్య గురించి చెప్పారు. సూర్య మొదట్లో చాలా క్యాజువల్ గా మాట్లాడే వారని తర్వాత మేమిద్దరం ఇంకో ఏడు సినిమాల్లో నటించామని జ్యోతిక చెప్పారు. ఏ సీన్ ని కూడా సూర్య అదునుగా తీసుకోలేదని, ఎంతవరకు సీన్ చేయాలో అంతవరకే చేసే వారని ఆయన బిహేవియర్ కూడా నాకు నచ్చిందని జ్యోతిక అన్నారు.
Also read:
- Leo Movie Review : లియో మూవీ రివ్యూ
- కాఫీతో అందాన్ని రెట్టింపు చేసుకోండి.. ముడతలు కూడా రావు…!
- చాణక్య నీతి: భార్య సంతోషంగా ఉండాలంటే.. భర్త ఈ 5 తప్పక పాటించాలి..!