Home » Leo Movie Review : లియో మూవీ రివ్యూ

Leo Movie Review : లియో మూవీ రివ్యూ

by Bunty
Ad

 

Leo Movie Review : దళపతి విజయ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఏడాది కోలీవుడ్ తో పాటు దక్షిణాది సిని అభిమానుల్లో అత్యంత ఆసక్తిని రేకెత్తించిన సినిమాల్లో లియో ఒకటి. దళపతి విజయ్ హీరోగా, లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఇవాళ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా… సంజయ్ దత్, అర్జున్ ప్రధాన పాత్రలు పోషించారు. మరి ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం.

Leo Movie Review

Leo Movie Review

కథ మరియు వివరణ :

Advertisement

దళపతి విజయ్ హీరోగా చేసిన లియో మూవీ కథ విషయానికి వస్తే, పార్థు (విజయ్) కాశ్మీరులో చాక్లెట్ బేకరీ ని మెయింటైన్ చేస్తూ తన కుటుంబంతో సంతోషంగా ఉంటాడు. అయితే ఒకరోజు పార్థు మరియు అతని కుటుంబంపైన గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేస్తూ ఉంటారు. పార్ధుకి ఏమీ అర్థం కాదు. అయితే పార్ధు లాగే లియో అనే గ్యాంగ్స్టర్ ఉండేవాడని, అతను కూడా పార్ధు లాగానే ఉంటాడని పార్ధుకి తెలుస్తుంది. ఇంతకీ లియో మరియు పార్ధు ఒక్కడేనా లేక ఇద్దరా… లియో గతం ఏంటి అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి.

Advertisement

ఫస్ట్ హాఫ్ లో ఓ సాధారణ వ్యక్తిగా, సెకండ్ హాఫ్ లో పవర్ఫుల్ గ్యాంగ్ స్టార్ గా రెండు డిఫరెంట్ వేరియేషన్స్ లో విజయ్ క్యారెక్టర్ సాగుతుందని ట్విట్స్ చేస్తున్నారు. ఇంటర్వెల్ ట్విస్ట్ ఈ సినిమాకు మైండ్ బ్లోయింగ్ గా నిలుస్తుందని అంటున్నారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో లియో ఓ భాగమని, ఖైదీతో లింక్ చేస్తూ లోకేష్ కనకరాజు సీన్స్ క్రియేట్ చేసిన విధానం హైలైట్ గా ఉంటుందని చెబుతున్నారు. ఖైదీలోని కొన్ని క్యారెక్టర్స్ ఈ సినిమాలో కనిపిస్తాయని పేర్కొంటున్నారు. క్లైమాక్స్ లో లియోదాస్, రోలెక్స్ ఫైట్ హైలైట్ గా ఉంటుందని అంటున్నారు. సాంకేతికంగా సినిమా ఉన్నంతగా ఉన్న కథ విషయంలో డైరెక్టర్ లోకేష్ కనకరాజు రొటీన్ గా అడుగులు వేశాడని చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ కొన్ని చోట్ల స్లోగా నడవడం ఇబ్బంది పెడుతోందని చెబుతున్నారు.

ప్లస్ పాయింట్లు

విజయ్
ట్విస్టులు
అనిరుద్ మ్యూజిక్

మైనస్ పాయింట్లు

కథనం

సినిమా రేటింగ్ : 2.75/5

 

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading