టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలామంది ప్రముఖులు ఇండస్ట్రీకి దూరమయ్యారు. 2020 సంవత్సరంలో కరోనా ప్రారంభమైనప్పటి నుంచి… ఇప్పటివరకు చాలామంది సినీ తారలు నేల రాలారు. ఇంకా వివిధ కారణాలవల్ల ప్రముఖ నటీనటులు మరణిస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాద సంఘటన చోటుచేసుకుంది. తాజాగా…అక్కినేని ఇంట తీవ్రవిషాదం నెలకొంది. దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు కూతురు, నాగార్జున సోదరి నాగ సరోజ కన్నుమూశారు.
అనారోగ్యం కారణంగా మంగళవారం ఆమె తుదిశ్వాస విడవగా….ఈ విషాద వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాగ సరోజా మంగళవారం ముంబైలో తుది శ్వాస విడిచారు. తొలినాళ్ల నుంచి సినీ పరిశ్రమకు దూరంగానే ఉన్న నాగ సరోజ…. సినిమా రిలీజ్ ఫంక్షన్ లో కానీ, ఏ ఇతర ఫంక్షన్ లోనూ పెద్దగా కనిపించలేదు. స్టార్ హీరో కూతురు అయినప్పటికీ చాలా సాధారణ జీవితాన్ని గడిపింది. ఏఎన్ఆర్ కు సత్యవతి, నాగ సుశీల, నాగ సరోజ, వెంకట్, నాగార్జున…. అయిదుగురు సంతానం.
Advertisement
Advertisement
కాగా అక్కినేని వారసత్వాన్ని అందుపుచ్చుకున్న నాగార్జున కుటుంబం… ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. నాగార్జున హీరోగా రాణించడమే కాకుండా అతని కుమారులు ఇద్దరు అక్కినేని నాగచైతన్య మరియు అక్కినేని అఖిల్ ను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అయితే అక్కినేని నాగార్జున సక్సెస్ అయినంత గా… అక్కినేని నాగచైతన్య మరియు అఖిల్ సక్సెస్ కాలేకపోతున్నారు. ఇది ఇలా ఉండగా అక్కినేని నాగేశ్వరరావు కూతురు, నాగార్జున సోదరి నాగ సరోజ అంత్యక్రియలు రేపు జరుగనున్నాయి.
ఇవి కూడా చదవండి
- రోజాకు ఇష్టమైన వంటకాలు ఇవే..మాంసం లేనిదే ముద్ద దిగదు ?
- NED vs SA : ఫుడ్ డెలివరీ బాయ్ చేతులో చిత్తు అయిన సఫారీలు !
- Roja Mahesh Babu : మహేష్ బాబుతో సినిమా చేస్తా.. ఆ పాత్రలోనే – రోజా