Home » Pallavi prashanth :పల్లవి ప్రశాంత్ కు పెళ్లయిందా.. అమ్మాయి ఈవిడే..!

Pallavi prashanth :పల్లవి ప్రశాంత్ కు పెళ్లయిందా.. అమ్మాయి ఈవిడే..!

by Bunty
Ad

ఓ సామాన్యమైన నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన పల్లవి ప్రశాంత్ ఇప్పుడు అందరికీ సుపరిచితమే. ఓ సాధారణమైన రైతుగా ఆ తర్వాత… యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించి తన వీడియోలతో ఫేమస్ అయ్యాడు. తన వీడియోల ద్వారా బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఎంపిక అయ్యాడు. ఇక ఇతను బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన మొదట్లో ఇతన్ని చూసిన చాలామంది ఎక్కువ రోజులు ఇతను హౌస్ లో ఉండడు అని అంతా భావించారు కానీ ఇప్పటికీ ఇతను హౌస్ లో కొనసాగుతున్నారు. వచ్చిన కొత్తలో ఇతను ఎక్కువగా అమ్మాయిలతో మాట్లాడుతూ ఉండేవాడు. ఆటపై అంత దృష్టిని పెట్టేవాడు కాదు.

Pallavi prashanth got married

ఇక ఆ తర్వాత నాగార్జున ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ తో ఇప్పుడు అద్భుతంగా తన ఆటని కొనసాగిస్తున్నాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో మొదటి కెప్టెన్ గా నిలిచాడు. ఇక తన అమాయకత్వంతో కెప్టెన్సీ ని కోల్పోయాడు. ఇతను ఓ ఆట ఆడుతున్న సమయంలో అతనికి తీవ్రంగా గాయమైంది. ఇక ఆ గాయం కారణంగా అతను బయటికి వచ్చేస్తున్నాడంటూ ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ ఆ వార్తల్లో నిజం లేదు. ఇక ఆ దెబ్బని సైతం తట్టుకొని బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్ కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Advertisement

ప్రశాంత్ కి వివాహం జరగలేదని అంతా అనుకున్నారు. కానీ ఇతను ఓ వీడియోలో పెళ్లి బట్టలతో కనిపించాడు. ఆ వీడియోలో తన పక్కన పెళ్లి బట్టలతో ఒక అమ్మాయి కూడా ఉంది. పెళ్లి ఫోటో ఒకటి బయటకు రాగా ఈ ఫోటో చూసిన చాలా మంది షాక్ అవుతున్నారు. వివాహమై బిగ్ బాస్ హౌస్ లో అలా అమ్మాయిలతో అంత చనువుగా ఉండడమేంటని కామెంట్లు పెడుతున్నారు. ఇక ప్రశాంత్ పెళ్లి వార్తలపై తన కుటుంబసభ్యులు కూడా ఇంతవరకు స్పందించలేదు. కానీ ఆ వీడియో షార్ట్ ఫిలింలో భాగంగా తీసిన పెళ్లి వీడియో అని కొంతమంది చెబుతున్నారు. ఇక ఈ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading